చిరంజీవి 150వ సినిమాలో రామ్చరణ్ | Ramcharan in Chiranjeevi's 150 cinema | Sakshi
Sakshi News home page

చిరంజీవి 150వ సినిమాలో రామ్చరణ్

Published Sun, Jul 6 2014 3:19 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

చిరంజీవి-రామ్ చరణ్ - Sakshi

చిరంజీవి-రామ్ చరణ్

ఒకప్పటి  టాలీవుడ్‌ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి వెండితెర రీఎంట్రీ గురించి ఈ ఏడాది   ప్రకటన చేయనున్నారు. త్వరలో పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి తన 150వ చిత్రం గురించి ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ సినిమా గీతా ఆర్ట్ బ్యానర్పైనే నిర్మించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా తన  చిత్రం ప్రారంభించాలని చిరంజీవి ఎంత  ఉత్సాహంగా ఉన్నారో,  తన తండ్రి నటించే ఈ మూవీలో నటించాలని రామ్చరణ్ తేజ కూడా అంతే ఉత్సాహంతో ఉన్నాడు. ఈ విషయాన్ని చరణే స్వయంగా ఇటీవల ఒక జర్నలిస్ట్ వద్ద ప్రస్తావించారు.

అత్యంత ప్రతాష్టాత్మకంగా నిర్మించదలచుకున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు కథలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీటిలో ఏదో ఒక దానిని ఖరారు చేసే అవకాశం ఉంది.  తాను కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు చరణ్ చెప్పారు. ఒకవేళ ఆ సినిమాలో తనకు తగిన పాత్ర లేకపోతే, తన కోసం ఒక పాత్ర సృష్టించమని రచయితని అభ్యర్థిస్తానని చెప్పారు. మెగాస్టార్ రీఎంట్రీ - అదీ 150 సినిమా కావడంతో అందులో  నటించడానికి  చరణ్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. చరణ్ ప్రస్తుతం 'గోవిందుడు అందరివాడే' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

 - శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement