రామ్చరణ్ స్మార్ట్ ఐడియా | Ramcharan official app for smart phones | Sakshi
Sakshi News home page

రామ్చరణ్ స్మార్ట్ ఐడియా

Published Sun, Oct 4 2015 12:26 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

రామ్చరణ్ స్మార్ట్ ఐడియా - Sakshi

రామ్చరణ్ స్మార్ట్ ఐడియా

టాలీవుడ్ యంగ్ హీరో రామ్చరణ్ మరో అరుదైన ఫీట్ సాదించాడు. తన పేరు మీద అఫీషియల్ యాప్ను లాంచ్ చేసిన తొలి సౌత్ హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఈ యాప్ను ఆడియన్స్కు పరిచయం చేస్తూ రూపొందించిన ఓ ఫన్నీ వీడియోను తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు రామ్ చరణ్.

గూగుల్ ప్లేస్టోర్తో పాటు యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా రామ్ చరణ్ లేటెస్ట్ సినిమాలకు సంబందించిన వార్తలు, ట్రైలర్స్, పోస్టర్స్, స్టిల్స్ను అభిమానులకు అందుబాటులో ఉంచుతున్నారు. చరణ్ కొత్త సినిమా ఇంటర్య్వూలను కూడా ఈ యాప్ ద్వారా చూసే అవకాశం కల్పిస్తున్నారు.

త్వరలో ప్రారంభం కానున్న చిరు 150 సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ తన సొంతం నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ యాప్ను రూపొందించాడు. ఈ యాప్ ద్వారా చరణ్ తమకు మరింత దగ్గరయ్యే అవకాశం ఏర్పడిందన్న ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement