
కరీంనగర్ వాసికి వర్మ బంపర్ ఆఫర్
మనిషి మైండే సినిమా పరిశ్రమ అని, రొటీన్కు భిన్నంగా ఆలోచిస్తే ఎవరైనా నటులు కావచ్చు, సినిమా కూడా తీయొచ్చని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. కరీంనగర్ వాసి ఒకరికి దర్శకత్వం అవకాశాన్ని ఆయన కల్పించారు.
'సాక్షి' మీడియా ఆధ్వర్యంలో రాంగోపాల్ వర్మ నిర్వహించిన చర్చాగోష్టికి సినిమా అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వర్మ సమర్పణలో కరీంనగర్కు చెందిన సిద్దార్థ దర్శకత్వంలో 'చరిత్ర' అనే సినిమాను నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎడ్ల అశోక్ తెలిపారు.