కరీంనగర్లో రాంగోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ! | Ramgopal varma film industry in Karimnagar? | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో రాంగోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ!

Published Tue, Nov 18 2014 12:04 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

కరీంనగర్లో రాంగోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ! - Sakshi

కరీంనగర్లో రాంగోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ!

కరీంనగర్ :  సినిమా రంగానికి కరీంనగర్ వేదిక కాబోతుందా...? జిల్లాలో 'న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ' స్థాపనకు బీజాలు పడబోతున్నాయా...? సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు నిజమేనని చెబుతున్నాయి. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఆధునిక యుగంలో హైదరాబాద్, ముంబయి, చెన్నైలాంటి మహానగరాల్లోనే కాకుండా ఎక్కడైనా సినిమాను నిర్మించవచ్చని వర్మ చెబుతున్నారు.

ఇందులో భాగంగానే జిల్లాలో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ' ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న వర్మ మంగళవారం కరీంనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా 'సాక్షి' ఆధ్వర్యంలో చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఆడిటోరియం వేదికగా 'కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు' అనే అంశంపై చర్చాగోష్టి చేపట్టారు.  సినీరంగానికి సంబంధించి 24 అంశాలపై వర్మ సూచనలు ఇవ్వనున్నారు. ప్రశ్నలుఎన్నైనా వర్మ ఒక్కరే సమాధానం ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement