![Rana Reply To Ram Gopal Varma Tweet - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/21/Rana%20VArma.jpg.webp?itok=iTrm3t4j)
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావటంతో రెండో భాగాన్ని పెద్దగా ప్రమోషన్ లేకుండా సైలెంట్ రిలీజ్ చేస్తున్నారు. రేపు (22-02-2019) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై వర్మ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నాడు.
ఈ రోజు ఉదయం నుంచి వరుస ట్వీట్లతో వేడి పెంచుతున్న రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపిస్తున్న రానాని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ మహానాయకుడులోని రానా క్యారెక్టర్ ఫోటోనూ పోస్ట్ చేసిన వర్మ ‘రానా.. నువ్వు ఒరిజినల్ కన్నా ఒరిజినల్‌గా కనిపిస్తున్నావ్’ అంటూ ట్వీట్ చేశాడు. వర్మ ఉద్దేశం ఏదైనా రానా మాత్రం వర్మ ట్వీట్‌ను పాజిటివ్‌గానే తీసుకున్నాడు. వర్మ కామెంట్‌కు రిప్లై ఇస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
Thank you
— Rana Daggubati (@RanaDaggubati) 21 February 2019
Comments
Please login to add a commentAdd a comment