రానా ‘కవచం’?
బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న రానా ప్రస్తుతం మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట.
కథ ఎగ్జయిట్‌మెంట్‌కి గురి చేయడంతో రానా ఒప్పుకున్నారట. ఈ సినిమాకి ‘కవచం’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని తెలిసింది. హను దర్శకత్వం వహించిన ‘అందాల రాక్షసి’ కమర్షియల్‌గా ఎంత వర్కవుట్ అయ్యిందనే విషయాన్ని పక్కన పెడితే, అతనిలో మంచి టెక్నీషియన్ ఉన్నాడని నిరూపించింది.
ఈసారి టెక్నికల్‌గా బాగుంటూనే, కమర్షియల్‌గా కూడా వర్కవుట్ అయ్యే సినిమాని హను ప్లాన్ చేసి ఉంటారని ఊహించవచ్చు. తెలుగులో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.