జర్నలిస్ట్ పై బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ విలనిజం
జర్నలిస్ట్ పై బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ విలనిజం
Published Fri, Dec 6 2013 5:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ లో మిస్టర్ కూల్, లవర్ బాయ్ గా నటుడు రణబీర్ కపూర్ యాగ్రీ యంగ్ మ్యాన్ గా మారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఇది సినిమాలో పాత్రకు సంబంధించిన విషయం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నిజ జీవితంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మారి టెలివిజన్ చానెల్ కు చెందిన జర్నలిస్టుతో గొడవపడటమే కాకుండా కెమెరాను లాక్కోవడం వివాదంగా మారింది. కెమెరాను తీసుకుని.. మీ బాస్ ను వచ్చి తీసుకోండి అని బెదిరించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పాలీ హిల్స్ లోని రణబీర్ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.
ఈ ఘటనలో రాయడానికి వీల్లేనంతగా రణబీర్ దుర్భాషలాడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అర్ధరాత్రి దాటినా కెమెరామెన్ వెంటాడుతుండటంతో రణబీర్ కోపానికి కారణమైంది. ఈ సంఘటన జరగడానికి కొద్ది సేపటి క్రితం వరకు ఖార్ లోని ఆలీవ్ రెస్టారెంట్ లో దర్శకుడు ఆయన్ ముఖర్జీ, మన్మోహన్ శెట్టి కూతురు ఆర్తీ శెట్టితో గడిపినట్టు సమాచారం. వెనక గేటు వద్ద కెమెరామెన్ తనకోసం ఉన్నాడని తెలుసుకున్న రణ్ బీర్ ఆటోరిక్షాలో మెయిన్ గేట్ నుంచి అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు.
ఆతర్వాత బెంజ్ వాహనంలో రణబీర్ ఇంటివద్దకు ఆయన్ చేరుకొన్నాడు. అప్పటికే అక్కడ ఉన్న వేచిచూస్తున్న హీరోను కారులో ఎక్కించుకోని వెళుతుండగా.. రణబీర్ ఉద్దేశపూర్వకంగా మీడియాను ఫాలో కావాలని రెచ్చగొడుతూ సైగలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే రణబీర్ వెంట ఓ అమ్మాయి కూడా ఉండటంతో మీడియా వెంబండించిందని తెలిసింది.
Advertisement
Advertisement