పుణేలో... రిస్కీ నిఖిల్! | Redefined Version of Sankarabharanam @ Bihar | Sakshi
Sakshi News home page

పుణేలో... రిస్కీ నిఖిల్!

Published Mon, Jun 22 2015 11:15 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

పుణేలో... రిస్కీ నిఖిల్! - Sakshi

పుణేలో... రిస్కీ నిఖిల్!

రిస్క్ తీసుకోవడానికి వెనకాడని యువ హీరోల్లో నిఖిల్ ఒకరు. ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ఆ సంగతి అర్థమవు తుంది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వెర్సస్ వెర్సస్’... ఇలా వరుసగా రిస్కీ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్న నిఖిల్ ఇప్పుడు ఏకంగా అలనాటి క్లాసిక్ ‘శంకరాభరణం’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ పేరుతో సినిమానా? రిస్క్ కాదా అనుకుంటున్నారా? కాదంటున్నారు చిత్రకథా రచయిత, సమర్పకుడు కోన వెంకట్. ఎందుకంటే, ఆ ‘శంకరాభరణం’కీ, ఈ చిత్రానికీ పోలిక ఉండదని ఆయన చెబుతున్నారు.

ఇది క్రైమ్, కామెడీ మూవీ అట. మనుషులు వెళ్లడానికి సాహసం చేయని రిస్కీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ రిస్క్‌లో ఓ కిక్ ఉందని చిత్రబృందం చెబు తోంది. ప్రస్తుతం పుణేకి అరవై కిలోమీటర్ల దూరంలో గల బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 25 వరకూ అక్కడ షూటింగ్ చేస్తామని నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement