వరుసగా మూడో సినిమాకు 100 కోట్లు | Rustom is expected to cross 100 crores | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో సినిమాకు 100 కోట్లు

Published Sat, Aug 20 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

వరుసగా మూడో సినిమాకు 100 కోట్లు

వరుసగా మూడో సినిమాకు 100 కోట్లు

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాంచి జోష్ మీదున్నాడు. ఈ ఏడాది విడుదలైన అక్షయ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్నాయి. వరుసగా మూడో సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరనుంది.  అక్షయ్ నటించిన ఎయిర్ లిఫ్ట్, హౌస్ఫుల్ 3 సినిమాలు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించగా,  తాజా చిత్రం రుస్తోం ఈ మార్క్కు చేరువైంది.

శుక్రవారం నాటికి రుస్తోంకు 95.31 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. శనివారం కలెక్షన్లతో కలిపి వంద కోట్లు (భారత్లో నెట్) దాటవచ్చని అంచనా వేశాడు. ఇక ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు వచ్చాయి. నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ సరసన ఇలియానా నటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement