3న ఎస్వీఆర్‌ శత జయంతి ఉత్సవాలు | s v ranga rao centenary celabrations | Sakshi
Sakshi News home page

3న ఎస్వీఆర్‌ శత జయంతి ఉత్సవాలు

Published Thu, Jun 28 2018 12:16 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

s v ranga rao centenary celabrations - Sakshi

యస్వీ రంగారావు

ఎంతమంది నటీనటులు ఉన్నా ‘విశ్వ నట చక్రవర్తి’ ఒక్కరే. వెండితెర విలక్షణ నటునిగా సినీ పరిశ్రమతో  పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు యస్వీ రంగారావు. 1918 జూలై 3న ఆయన జన్మించారు. జూలై 3వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘సంగమం’ సంస్థ ఆధ్వర్యంలో యస్వీఆర్‌ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘సంగమం’ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్‌ కిశోర్‌ ఓ ప్రకటన రిలీజ్‌ చేశారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఎస్వీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్‌గారు, కె.వి.రమణాచారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యస్వీఆర్‌తో కలిసి నటించిన వారితో పాటు తర్వాత కాలంలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్టులను సత్కరిస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement