టార్చ్‌లైట్‌లో వేశ్యగా సదా | Sadha Plays A Call Girl In Torch Light! | Sakshi
Sakshi News home page

టార్చ్‌లైట్‌లో వేశ్యగా సదా

Published Sun, Aug 13 2017 2:39 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

టార్చ్‌లైట్‌లో వేశ్యగా సదా

టార్చ్‌లైట్‌లో వేశ్యగా సదా

తమిళసినిమా:  ఇప్పుడు వేశ్య పాత్రలో నటించడానికి టాప్‌ హీరోయిన్లు కూడా రెడీ అంటున్నారు. నటి అనుష్క, శ్రియ, చార్మి ఇలా చాలా మంది నటీమణులు నటించేశారు. అలాంటిది పలువురు హీరోయిన్లు నో అన్న వేశ్య పాత్రలో నేను రెడీ అందట నటి సదా. మరి ఆ పాత్రలో ఎంత మసాలా ఉంటుందో. ఈ అమ్మడు ఇంతకు ముందు కోలీవుడ్‌లో క్రేజీ నాయకిగా రాణించిందన్నది తెలిసిందే.

జయం చిత్రంతో దిగుమతి అయిన సదా ఆ తరువాత అజిత్‌తో తిరుపతి, మాధవన్‌కు జంటగా ఎదిరి ఇలా చాలా చిత్రాల్లో నటించింది. స్టార్‌ దర్శకుడు శంకర్‌ కూడా విక్రమ్‌ సరసన అనియన్‌ చిత్రంలో నటి సదానే నాయకిగా ఎంచుకున్నారన్నది గమనార్హం. అలాంటి నటి ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇటీవల తరచూ టీవీ షోల్లో కనిపిస్తున్న సదాకు కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్‌ అనే చిత్రంలో వేశ్యగా నటిస్తోందట.


ఇంతకు ముందు విజయ్‌ హీరోగా తమిళన్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అబ్దుల్‌ మజీద్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం టార్చ్‌లైట్‌.దీని గురించి  దర్శకుడు తెలుపుతూ  ఏ అమ్మాయి అయినా కోరి పడుపు వృత్తికి దిగదన్నారు. పరిస్థితుల ప్రభావం, మోసాలకు గురయ్యో ఆ వృత్తిలోకి నెట్టబడతారన్నారు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహనను కలిగించే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం టార్చ్‌లైట్‌ అని చెప్పారు.

ఈ కథను చాలామంది నటీమణులకు చెప్పగా నటించడానికి నిరాకరించారని, తమ ఇమేజ్‌ దెబ్బతింటుందని భయపడ్డారని చెప్పారు. చివరికి నటి సదాను వెతుక్కుంటూ వెళ్లి కథ చెప్పగా ఇలాంటి కథా చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని, తాను తప్పకుండా నటిస్తానని అన్నారని తెలిపారు. సదా వేశ్యగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ టార్చ్‌లైట్‌ చిత్రంలో ఉదయ్‌ అనే నూతన నటుడు హీరోగానూ అతనికి జంటగా రిత్విక హీరోయిన్‌గానూ నటిస్తోందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement