ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సాయి ధరమ్‌ తేజ్‌ | Sai Dharam Tej And Maruthi Movie Title Bhogi | Sakshi
Sakshi News home page

ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సాయి ధరమ్‌ తేజ్‌

Published Tue, Jun 4 2019 12:14 PM | Last Updated on Tue, Jun 4 2019 12:14 PM

Sai Dharam Tej And Maruthi Movie Title Bhogi - Sakshi

ఇటీవల చిత్రలహరి సినిమాతో ఆకట్టుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సాయి, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత చిత్రలహరితో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన ఈ మెగా హీరో నెక్ట్స్‌ సినిమాతోనూ అదే సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. టైటిల్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సాయి ధరమ్‌ ప్లే బాయ్‌ తరహా పాత్రలో కనిపించనున్నాడనిపిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement