
కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తరువాత తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో ఫాంతో పాటు మార్కెట్‌ను కోల్పోయాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చిత్రలహరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సాయి ధరమ్. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా తరువాత కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట సాయి ధరమ్ తేజ్. భలే భలే మొగాడివోయ్ తరువాత మహానుభావుడుతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మారుతి చాలా రోజులుగా నాని హీరోగా సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు. అయితే నాని ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం కనిపించకపోవటంతో సాయి ధరమ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.