వేలం ఏర్పాట్లలో సమంత! | samantha acts in Irumbu Thirai movie | Sakshi
Sakshi News home page

వేలం ఏర్పాట్లలో సమంత!

Published Sat, Jan 20 2018 7:03 AM | Last Updated on Sat, Jan 20 2018 10:00 AM

samantha acts in Irumbu Thirai movie - Sakshi

సాక్షి, చెన్నై: నటి సమంత వేలం ఏర్పాట్లు చేస్తున్నారట. ఏలం గొడవేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇటీవలే హైదరాబాదీగా మారిన ఈ చెన్నై చిన్నది ఏం చేసినా ఒక  ప్రత్యేకత ఉంటుంది. సహ నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కాకుండా తెలుగులో ఏమాయ చేసావే అనే ఒక్క చిత్రంతోనే క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న హీరోయిన్‌ సమంత. అంతేకాదు ఆ తొలి చిత్ర హీరో (నాగచైతన్య) ప్రేమలోనే పడి, ప్రియుడినే పెళ్లి పేరుతో చెంగుకు కట్టేసుకున్న నటి సమంత. ఇవన్నీ చక చకా జరిగిపోయాయి. చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ హీరోలతో నటించి పేరు కూడా తెచ్చుకున్న సమంత వివాహానంతరం హీరోయిన్‌గా నటనను కొనసాగుస్తున్న విషయం తెలిసిందే. 

సమంతలో మరో కోణం సేవా గుణం. తన ప్రత్యూష అనే స్వచ్ఛంద సేవాసంస్థను నెలకొల్పి నిరుపేదకు, పేద విద్యార్థులకు తన వంతు సాయం చేస్తున్నారు.ఇక తాజా విషయానికి వస్తే సమంత పెళ్లి గోవాలో అంగరంగవైభోగంగా జరిగింది. హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ జరిగింది. ఈ వేడుకల్లో బోలెడు విలువైన కానుకలు వచ్చాయట. వాటన్నిటినీ ఇప్పుడు వేలం వేయాలని నిర్ణయించుకున్నారట. తన నిర్ణయాన్ని భర్త నాగచైతన్యకు చెప్పగా మారుమాట్లాడకుండా గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. 

అదే విధంగా అత్తమామలు నాగార్జున, అమలలకు చెప్పగా నీ ఇష్టం అని అన్నారట. ఇంకేముంది పెళ్లి కానుకలను వేలం వేయడానికి సమంత ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారట. ఎప్పుడు వేలం వేసేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇంతకీ వేలంలో వచ్చిన డబ్బును సమంత ఏంచేయాలనుకుంటున్నారో తెలుసా? నిరుపేదలకు, విద్యార్థులకు సాయంగా అందించనున్నారట. ఈ బ్యూటీ తమిళంలో విశాల్‌తో నటించిన ఇరుంబుతెరై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరగనుంది. త్వరలో తెరపైకి తీసుకురావడానికి విశాల్‌ సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement