marriage gifts
-
వైఎస్సార్ పెళ్లి కానుక పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సందర్భంగా పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం జీఓ జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు ఇస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలానే ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలను ప్రొత్సాహిస్తూ ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఏకంగా రూ.1.20లక్షలకు పెంచింది. గతంలో ఎస్టీలకు ఇచ్చే రూ. 50వేల మొత్తాన్ని.. రూ.లక్షకు, బీసీలకు ఇచ్చే రూ. 35వేలను రూ.50వేలకు, మైనారిటీలకు ఇచ్చే రూ. 50వేలను లక్ష రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.లక్షను రూ. 1.50లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే రూ.20 వేలను లక్ష రూపాయలకు పెంచింది. -
మండపానికి పెట్రోల్‌తో వచ్చారు..!
చెన్నై : పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులు ఊరకనే రారు. నూతన దంపతులకు అవసరమయ్యే వస్తువును ఏదో ఒక దాన్ని బహుమతిగా ఇస్తారు. తమిళనాడుకు చెందిన కొందరు స్నేహితులు కూడా ఇలానే చేశారు. కానీ వారు ఇచ్చిన గిఫ్ట్ చూసిన వారు మాత్రం ఒక్క క్షణం నివ్వెరపోయారు.. అనంతరం తేరుకుని పడిపడి నవ్వారు. పెళ్లి పందిరిలో ఇంతలా నవ్వులు పూచించిన ఆ గిఫ్ట్ ఏంటంటే ‘పెట్రోల్’.. అవును పెళ్లి బహుమతిగా వారు తమ స్నేహితునికి 5 లీటర్ల పెట్రోల్‌ని బహుకరించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్లో చోటుచేసుకుంది. పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ‘పెళ్లికానుక’గా పెట్రోల్ ఇస్తే బాగుంటుందని భావించినట్లు సదరు మిత్ర బృందం తెలిపింది. -
పెళ్లి కానుకేదీ!
ఏలూరు (మెట్రో): చంద్రన్న పెళ్లికానుక.. పథకంపై సర్కారు కినుక వహించింది. ఈ పథకాన్ని ప్రకటించి నెలలు కావస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా సంది గ్ధం నెలకొంది. పేదకుటుంబాల్లోని యువతుల వివాహం వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి చంద్రన్న పెళ్లికానుకగా నామకరణ చేసింది. కానుక ఇలా పెళ్లికానుకగా.. బీసీ, మైనారిటీలకు రూ.35 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, కాపులకు రూ.30 వేలు పెళ్లి పందిట్లోనే ఇవ్వాలని నిర్ణయించింది. 7 నెలల కిందటే దీనిని ప్రకటించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పథకం పట్టాలెక్కుతుందని చెప్పింది. అయినా ఇప్పటికీ స్పష్టమైన విధివిధానాలు ఖరారు కాలేదు. పెళ్లిళ్ల జోరు ప్రస్తుతం పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. దీంతో పెదిళ్లలో చంద్రన్న పెళ్లికానుకపై అయోమయం నెలకొంది. దరఖాస్తు, లబ్ధి కోసం పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పష్టత రావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచే వివాహాల సందడి మొదలైంది. మార్చి నెలాఖరు వరకూ పెళ్లిళ్లు జరగనున్నాయి. కల్యాణ మిత్రల ఎంపికకే పరిమితం చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు మండలానికి ముగ్గురు చొప్పున కల్యాణ మిత్రలను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను ఎంపిక చేశారు. ఆయా మండలాల పరిధిలో ముగ్గురుని ఎంపిక చేసి వారిలో ఇద్దరిని శాశ్వతంగా.. మరొకరిని అదనంగా నియమించారు. వీరిలో శాశ్వతంగా నియమించిన వారికి మండలంలోని పంచాయతీలను సమానంగా కేటాయిస్తారు. ఏ పంచాయతీలో కల్యాణమిత్ర పనిచేయకుంటే అక్కడ అదనంగా ఏర్పాటు చేసిన కల్యాణమిత్రకు ఆ వివాహ బాధ్యతను అప్పగిస్తారు. ఈ విధంగా జిల్లాలో 48 మండలాల్లో 144 మందిని ఎంపిక చేశారు. వీరికి గౌరవ వేతనంగా ఒక్క పెళ్లికి రూ.300 చొప్పున నిర్ణయించారు. అదే పెళ్లి రాత్రి సమయాల్లో నిర్వహిస్తే ఆ పెళ్లికి వెళ్లేందుకు రూ.500 కల్యాణమిత్రకు అందించనున్నారు. అయినా ఎదురుచూపులకే పథకం పరిమితమైంది. గత రెండు రోజులుగా అంటే ఈనెల 16, 17 తేదీల్లో ఎంపిక చేసిన కల్యాణ మిత్రలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో పెళ్లి జంటలను ఏ విధంగా గుర్తించాలి, ధరఖాస్తులను ఏవిధంగా అప్లోడ్ చేయాలనే వాటిపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే 246 జంటలు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ 246 జంటలు ఒక్కటయ్యాయని తెలుస్తోది. ఈ పెళ్లిళ్లల్లో సుమారు 200 జంటలు పేద వర్గాల వారే ఉన్నట్లు అంచనా. అయితే వీరందరూ చంద్రన్న పెళ్లి కానుకను కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఉద్దేశం ఇదీ.. ప్రధానంగా బాల్యవివాహాలను అరికట్టేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే వధువుకు 18, వరునికి 21 సంవత్సరాలు నిండడం తప్పనిసరి. ఆధార్‌కార్డును ఈ వివరాల కోసం పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయడం ద్వారా పెళ్లికానుక లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుంది. ఇప్పటి వరకూ ప్రతి వివాహాన్ని రిజస్ట్రేషన్ చేయించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. తాజాగా చంద్రన్న పెళ్లికానుక పొందాలంటే తప్పక పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావాలి. 2019వ సంవత్సరం నుంచి పదోతరగతి కూడా వధూవరులు పూర్తి చేయాలనేది నిబంధనగా విధించారు. దీనివల్ల అక్షరాస్యత పెరుగుతుందనేది ప్రభుత్వ వాదన. అయితే ఇంతటి కీలకమైన పథకం అమలులో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. త్వరగా ఈ పథకం అమలు చేయాలని పేదలు కోరుతున్నారు. శిక్షణ పూర్తి చేశాం ఇప్పటికే కల్యాణమిత్రల ఎంపిక పూర్తి చేశాం. ఎంపికైన వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చాం. వీరికి డివైజ్‌లు అందించాం. పథకం ఎప్పటి నుంచి అమలు చేయాలో ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం. ప్రభుత్వం పథకం ఆచరణలో పెట్టాలని ఆదేశించిన మరుక్షణం జిల్లాలో అమలుకు సిద్ధంగా ఉన్నాం. కె.శ్రీనివాసులు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
వేలం ఏర్పాట్లలో సమంత!
సాక్షి, చెన్నై: నటి సమంత వేలం ఏర్పాట్లు చేస్తున్నారట. ఏలం గొడవేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇటీవలే హైదరాబాదీగా మారిన ఈ చెన్నై చిన్నది ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సహ నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కాకుండా తెలుగులో ఏమాయ చేసావే అనే ఒక్క చిత్రంతోనే క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ సమంత. అంతేకాదు ఆ తొలి చిత్ర హీరో (నాగచైతన్య) ప్రేమలోనే పడి, ప్రియుడినే పెళ్లి పేరుతో చెంగుకు కట్టేసుకున్న నటి సమంత. ఇవన్నీ చక చకా జరిగిపోయాయి. చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ హీరోలతో నటించి పేరు కూడా తెచ్చుకున్న సమంత వివాహానంతరం హీరోయిన్గా నటనను కొనసాగుస్తున్న విషయం తెలిసిందే. సమంతలో మరో కోణం సేవా గుణం. తన ప్రత్యూష అనే స్వచ్ఛంద సేవాసంస్థను నెలకొల్పి నిరుపేదకు, పేద విద్యార్థులకు తన వంతు సాయం చేస్తున్నారు.ఇక తాజా విషయానికి వస్తే సమంత పెళ్లి గోవాలో అంగరంగవైభోగంగా జరిగింది. హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకల్లో బోలెడు విలువైన కానుకలు వచ్చాయట. వాటన్నిటినీ ఇప్పుడు వేలం వేయాలని నిర్ణయించుకున్నారట. తన నిర్ణయాన్ని భర్త నాగచైతన్యకు చెప్పగా మారుమాట్లాడకుండా గ్నీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అదే విధంగా అత్తమామలు నాగార్జున, అమలలకు చెప్పగా నీ ఇష్టం అని అన్నారట. ఇంకేముంది పెళ్లి కానుకలను వేలం వేయడానికి సమంత ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారట. ఎప్పుడు వేలం వేసేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇంతకీ వేలంలో వచ్చిన డబ్బును సమంత ఏంచేయాలనుకుంటున్నారో తెలుసా? నిరుపేదలకు, విద్యార్థులకు సాయంగా అందించనున్నారట. ఈ బ్యూటీ తమిళంలో విశాల్‌తో నటించిన ఇరుంబుతెరై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరగనుంది. త్వరలో తెరపైకి తీసుకురావడానికి విశాల్ సన్నాహాలు చేస్తున్నారు. -
పెళ్లి చదివింపుల్లో వినూత్న మోసం
సాక్షి, కేకే నగర్(చెన్నై): కోవిల్పట్టి పెళ్లి మండపంలో చదివింపుల సమయంలో వినూత్న మోసానికి పాల్పడిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుక్కుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలో గల కరుపూర్‌కు చెందిన వీరస్వామి కుమారుడు నిరుబన్కు వినితతో కోవిల్పట్టిలోగల కల్యాణ మండపంలో సోమవారం పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన వారు చదివింపులు ఇవ్వగా వాటిని కరుపూర్‌కు చెందిన విజయకుమార్ (36) వసూలు చేశాడు. అనేక మంది క్యూలో నిలబడి చదివిస్తున్నారు. రద్దీగా ఉన్న ఆ సమయంలో 40 ఏళ్ల వ్యక్తి తాను రూ. 2 వేలు ఇచ్చానని అందులో రూ.200 తీసుకుని మిగిలిన చిల్లర ఇవ్వాలని అడిగాడు. సరిగ్గా గమనించని విజయకుమార్ రూ. 1800 తిరిగి ఇచ్చాడు. కొంత సేపటి తర్వాత 50 ఏళ్ల మహిళ తాను రూ.2 వేలు ఇచ్చానని రూ.200 తీసుకుని మిగతా డబ్బు ఇవ్వాలని అడిగింది. వెంటనే అనుమానంతో మహిళను, ముందు చిల్లర తీసుకున్న వ్యక్తిని కోవిల్పట్టి పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ ఇరువురు మదురై జిల్లా నాగమలై పుదుకోట పావలర్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన ధనికోటి(40), పిచ్చైయమ్మాల్(50) అని తెలిసింది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ధనికోటి నుంచి రెండు వేలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరు ఇదే విధంగా పలు పెళ్లిళ్లకు హాజరై చేతివాటం చూపే వారని తెలిసింది. -
పెళ్లి కానుకలు
వియత్నాంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లా ఉంది! అలంకరించిన రిక్షాలు కాన్వాయ్‌గా వెళ్తున్న ఈ దృశ్యం రాజధాని హనోయ్లోది. పెళ్లికొడుకువాళ్లు తమ కానుకల్ని పెళ్లికూతురు కుటుంబానికి ఇలా పంపుతున్నారు. మహాయాన బౌద్ధ శాఖ విస్తరించివున్న ఆ దేశంలో పెళ్లికి సాంస్కృతికంగా చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా పెళ్లికి వారం రోజులముందు ఈ లాంఛనాలు అందుతాయి. కొండ కడుపున ఇల్లు వీళ్లు పెరూ దేశస్థులు. అందులోనూ అయాకుషో రాష్ట్రం వారు. అందునా చుపాన్ గ్రామస్థులు. ఈ ఊరు అండీస్ పర్వతశ్రేణుల్లో ఉంటుంది. ఊరంటే ముప్పై కుటుంబాలంతే! వీళ్లు ఎక్కువగా మొక్కజొన్న, ఆలుగడ్డలు పండిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ ఫొటోలో ఉన్న వాళ్ల ఇంటిపేరు డియాజ్. ఫెర్నాండెజ్, లోపెజ్లాగే ఇదీ దక్షిణ అమెరికాలో ఎక్కువమందికి ఉండే ఇంటిపేరు. సరేగానీ, ఇంతకీ వీళ్లు ఇవ్వాళ ఏం వండుకున్నారు? నూడుల్సు, ఆలుగడ్డలు, చిక్కుళ్లు, మొక్కజొన్న. అన్నట్టూ, అయాకుషోలో 33 చర్చిలున్నాయి. ఏసుక్రీస్తు జీవితంలోని ఒక్కో సంవత్సరాన్నీ ఒక్కోటీ ప్రతిబింబిస్తుంది. మళ్లీ బడికి... సోమవారం నాడు బడికి వెళ్లడమంటే... కష్టమే కదా! క్యూబా పిల్లలకైనా తప్పేది కాదు కదా! ఈ గుర్రపుబండి దృశ్యం అక్కడి ‘శాన్ జోస్ డె లాస్ లాజస్’లోది. అన్నట్టూ, అక్కడ విద్య మొత్తం ప్రభుత్వాధీనంలో ఉంటుంది. క్యూబా తన బడ్జెట్లో పది శాతం ఈ రంగానికి కేటాయిస్తుంది. యునెస్కో ప్రకారం అగ్రదేశాలు అమెరికా , బ్రిటన్ కేటాయించేది వరుసగా 2, 4 శాతాలు మాత్రమే!