
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సందర్భంగా పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం జీఓ జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు ఇస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలానే ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలను ప్రొత్సాహిస్తూ ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఏకంగా రూ.1.20లక్షలకు పెంచింది. గతంలో ఎస్టీలకు ఇచ్చే రూ. 50వేల మొత్తాన్ని.. రూ.లక్షకు, బీసీలకు ఇచ్చే రూ. 35వేలను రూ.50వేలకు, మైనారిటీలకు ఇచ్చే రూ. 50వేలను లక్ష రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.లక్షను రూ. 1.50లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే రూ.20 వేలను లక్ష రూపాయలకు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment