చచ్చిపోతున్నా.. సమంత ట్వీట్‌ | Samantha Akkineni Reacts On Cute Baby Rangamma Mangamma Dance | Sakshi
Sakshi News home page

ఆ చిన్నారి స్టెపులకు సమంత ఫిదా

Published Thu, Apr 19 2018 6:29 PM | Last Updated on Thu, Apr 19 2018 6:29 PM

Samantha Akkineni Reacts On Cute Baby Rangamma Mangamma Dance - Sakshi

అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా.. పొడవాటి జుట్టుకు రిబ్బను కట్టుకుని.. రంగస్థలం సినిమాలో సమంతా చేసిన యాక్టింగ్‌ ప్రేక్షకులకు మంత్రముగ్థుల్ని చేసేసింది. రామలక్ష్మి పాత్రతో సమంతా ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకుంది. ఇక రంగమ్మ.. మంగమ్మ.. పాటలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఫిదా చేసింది అక్కినేని ముద్దుల కోడలు. ఈ ముద్దుల కోడల్ని మించి మరో బుల్లి రామలక్ష్మి నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఓ చిన్నారి చక్కగా లంగా ఓణీ వేసుకుని, పెద్ద జుట్టుతో, ముద్దు ముద్దు హావభావాలతో ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు స్టెపులు వేసింది. అచ్చం సమంతలాగే వయ్యారంగా చేతులు తిప్పుతూ ఈ చిట్టి రామలక్ష్మి వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ చిట్టి రామలక్ష్మి డ్యాన్స్‌కు కేవలం నెటిజన్లే కాదు.. సమంత, ‘రంగమ్మత్త’ అనసూయ కూడా ఫిదా అయిపోయారు. ఈ వీడియోను శ్రీధర్‌ శ్రీ అనే అభిమాని ఒకరు సమంతకు ట్వీట్‌ చేస్తూ..రామలక్ష్మి పాత్ర ఒక్క మాకే కాదు కొన్ని వందలమంది హృదయాల్లో నిలిచిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని పేర్కొన్నారు. ఈ చిట్టి రామలక్ష్మికి ఫిదా అయిన సమంత సైతం చచ్చిపోతున్నా అని హార్ట్‌ సింబల్స్‌తో రిప్లై ఇచ్చారు.  సమంత ట్వీట్‌పై అనసూయ స్పందిస్తూ..‘నేను కూడా. ఇంత క్యూట్‌గా ఉండడం చాలా నేరం’ అంటూ ట్వీట్‌ చేశారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘రంగస్థలం’ చిత్రం ఘనవిజయం సాధించింది.‌ ఈ సినిమాలో ఉన్న ఈ ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్‌ ఫుల్‌గా ఫేమస్‌ అయింది. ఈ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఇదే సాంగ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement