రూట్‌ మార్చిన చెన్నై చిన్నది | Samantha and Robo Shankar comic portions in Irumbu thirai vishal | Sakshi
Sakshi News home page

రూట్‌ మార్చిన చెన్నై చిన్నది

Published Tue, Apr 18 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

రూట్‌ మార్చిన చెన్నై చిన్నది

రూట్‌ మార్చిన చెన్నై చిన్నది

 చెన్నై చిన్నది సమంత రూట్‌ మార్చారు. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించిన జనతాగ్యారేజ్‌ చిత్రం తరువాత నటుడు నాగచైతన్యతో ప్రేమ, నిశ్చితార్థం అంటూ నటనకు చిన్న గ్యాప్‌ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా మళ్లీ బిజీ అయ్యారు. తమిళంలో విజయ్‌ 61వ చిత్రంతో పాటు, విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, అనీతి కతైగళ్‌ అనే మరో చిత్రం, అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న మహానది చిత్రం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీ అయ్యిపోయారు.

ఆ మధ్య సూర్యకు జంటగా నటించిన అంజాన్‌ చిత్రంలో టూ పీస్‌ దుస్తులతో నటించి పెద్ద దుమారానికి తెర తీసిన సమంత తరువాత నటనకు అవకాశం ఉన్న చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకూ హాస్యానికి ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించని ఈ ముద్దుగుమ్మ తాజాగా విశాల్‌కు జంటగా నటిస్తున్న ఇరుంబుతిరై చిత్రంలో తొలిసారిగా కడుపుబ్బ నవ్వించే పాత్రలో నటిస్తున్నారట.

ఇందులో రోబో శంకర్‌తో కలిసి సమంత పండించే హాస్యానికి చిత్ర యూనిట్‌ తెగ  నవ్వేస్తున్నారట. ఇకపై నటిగా తన రూట్‌ మార్చుకోవాలన్న సమంత తన పాత్రల్లో వినోదానికి పెద్ద పీట వేసేలా చూసుకుంటుందట. మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఇరుంబుతిరై చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement