కొనసాగుతున్న సమంత, సిద్ధార్థ్ ప్రేమ | samantha, siddharth love story continues | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సమంత, సిద్ధార్థ్ ప్రేమ

Published Thu, Nov 14 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

కొనసాగుతున్న సమంత, సిద్ధార్థ్ ప్రేమ

కొనసాగుతున్న సమంత, సిద్ధార్థ్ ప్రేమ

నటుడు సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ రహస్యంగా కొనసాగుతూనే ఉందని కోలీ వుడ్ వర్గాల టాక్. సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి పీట లెక్కనున్నారని మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. సమంతతో ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడగానే తన వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకురావద్దని నటుడు సిద్ధార్థ్ తప్పించుకుంటున్నారు. సమంత మా త్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.
 
  తమ గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఆద్యంత్యం ఎంజాయ్ చేస్తున్నారట. ఈ వ్యవహారంలో సమంత కొంచెం కూడా ఆవేశపడకుండా చిరునవ్వులు చిందిస్తూ ఎలాంటి రియాక్షన్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారట. తమ గురించి ప్రచారమైన వార్తలను షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటూ పక్కవారికి చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. అంతేకాని తమ మధ్య ప్రేమ నిజమేనని కాని, అలాంటిదేమీ లేదని కానీ ఖం డించడం లేద ట. మీడియా ఇంకా ఎంతకాలం తమ గురించి ఇలా ప్రచారం చేస్తుందో చూద్దాం అన్నట్లుగా సమంత అన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement