సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ రిపీట్‌  | Samuthirakani Nadodigal 2 Movie Ready To release | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ రిపీట్‌ 

Published Sat, Apr 27 2019 7:48 AM | Last Updated on Sat, Apr 27 2019 7:48 AM

Samuthirakani Nadodigal 2 Movie Ready To release - Sakshi

తమిళసినిమా: సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ రిపీట్‌ అయితే కచ్చితంగా ఆ చిత్రంపై అంచనాలు ఏర్పడతాయి. దర్శకుడు సముద్రఖని మొదట్లో సక్సెస్‌ కోసం చాలా పోరాడారు. అలా పోరాడి నాడోడిగళ్‌ చిత్రంతో కమర్శియల్‌ విజయాన్ని తొలిసారిగా అందుకున్నారు. అందులో హీరోగా నటించిన శశికుమార్‌కు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతే కాదు అందులో నటించిన నటి అనన్య, అభినయ, విజయ్‌వసంత్, భర ణి, గంజాకరుప్పు వంటి నటీనటులకు మంచి లైఫ్‌ను ఇచ్చిందనే చెప్పాలి. నాడోడిగళ్‌ చిత్రం తెలుగు, కన్నడం, హిందీ వంటి భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. ఆ చిత్రం 2009లో విడుదలైంది. అంటే దశాబ్దం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శశికుమార్, సముద్రఖనిల కాంబినేషన్‌లో నాడోడిగళ్‌–2 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి అంజలి నాయకిగా నటిస్తోంది. మరో నాయకిగా అతుల్యరవి నటిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని శుక్రవారం పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాడోడిగళ్‌–2 చిత్ర టీమ్‌ శశికుమార్, అంజలి, అతుల్యరవి, భరణిలతో మరో చిత్రం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని సముద్రఖని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement