
అనుకోని కలయిక!
అది గుజరాత్‌లోని ఓ హోటల్. ఆ హోటల్‌లో ఇద్దరు స్టార్స్ బస చేశారు. ఒకరు క్రికెట్ స్టార్ కపిల్ దేవ్. మరొకరు సినిమా స్టార్ పవన్ కల్యాణ్. ఈ ఇద్దరూ అనుకోకుండా ఆ హోటల్‌లో కలిశారు. ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ‘‘మీ సినిమాలు నేను చూశాను. చాలా ఎంజాయ్ చేస్తుంటాను’’ అని పవన్‌తో భారత మాజీ కెప్టెన్ కపిల్ అన్నారు. ఆ మాటలకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో నవ్వారు.
ఈ హీరోగారు గుజరాత్‌లో ఎందుకు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా శరత్ మరార్ నిర్మిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.