రజనీ ఓకే అంటే ‘లీడర్’ చేస్తా | Sekhar Kammula to Remake Leader with Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీ ఓకే అంటే ‘లీడర్’ చేస్తా

Published Sun, Feb 16 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

రజనీ ఓకే అంటే ‘లీడర్’ చేస్తా

రజనీ ఓకే అంటే ‘లీడర్’ చేస్తా

సూపర్‌స్టార్ ఓకే అంటే ఆయనతో లీడర్ చిత్రాన్ని తమిళంలో చేస్తానని టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఈయన నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘నీ వంగే ఎన్ అన్బే’ (తెలుగులో అనామిక). ఇది బాలీవుడ్‌లో విద్యాబాలన్ నటించిన సంచలన చిత్రం ‘కహాని’కి రీమేక్. ఈ చిత్రం గురించి దర్శకుడు విలేకరులతో మాట్లాడుతూ,  తానింతకుముందు రీమేక్ చిత్రాలు చేయలేదన్నారు. నీ వంగే ఎన్ అన్బే చిత్రంలోని హీరోయిన్ పాత్రకు నయనతార చాలా చక్కగా నప్పారన్నారు. హిందీలో నటించిన విద్యాబాలన్ కంటే నయనతార బాగా నటించారని కితాబిచ్చారు.  
 
 దర్శకుడిగా నయనతార నటన సంతృప్తి నిచ్చిందన్నారు. ఇది రీమేక్ అయినా స్క్రీన్‌ప్లే మార్చినట్టు తెలిపారు. హిందీలో విద్యాబాలన్ గర్భిణిగా నటించారని తమిళం, తెలుగులో అలా చిత్రీకరించలేదని చెప్పారు. స్త్రీ ధైర్యశాలి అని ఆమెను దయార్ధ్రంగా చూపించడం ఇష్టంలేకే మార్చామని వివరించారు. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్‌కు నయనతార లేకపోవడం గురించి అడుగుతున్నారని గుర్తుచేశారు. తదుపరి ప్రచారానికి ఆమె హాజరవుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి మరగదమణి(కీరవాణి) సంగీతం, విజయ్ సీ కుమార్ ఛాయూగ్రహణంబలంగా ఉంటుందని అన్నారు. తెలుగులో తాను దర్శకత్వం వహించిన లీడర్ చిత్రాన్ని చూడాలని రజనీకాంత్‌ను కోరానన్నారు. ఆయన చూసి ఓకే అంటే తమిళంలో రీమేక్ చేస్తానని దర్శకుడు శేఖర్‌కమ్ముల పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement