సల్మాన్ రేప్ కామెంట్స్పై షారుక్ స్పందన.. | Shah Rukh Khan response to Salman Khan Apologise For Rape Remark | Sakshi
Sakshi News home page

సల్మాన్ రేప్ కామెంట్స్పై షారుక్ స్పందన..

Published Fri, Jul 1 2016 8:14 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

సల్మాన్ రేప్ కామెంట్స్పై షారుక్ స్పందన.. - Sakshi

సల్మాన్ రేప్ కామెంట్స్పై షారుక్ స్పందన..

ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రేప్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. దీనిపై క్షమాపనలు ఇంతవరకు సల్మాన్ క్షమాపణలు చెప్పలేదు. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదంటూ సల్మాన్ ఖాన్ లాయర్ స్పష్టం చేశారు. అయితే, జాతీయ మహిళా కమిషన్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. సల్మాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ తాజాగా మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. జులై 8న కమిషన్ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆయనను ఆదేశించింది.

'నా పరిస్థితి రేప్కు గురైన మహిళలా ఉంది' అని వ్యాఖ్యానించిన సల్మాన్.. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా అని మీడియా షారుక్ ఖాన్ను ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. 'గత కొన్ని సంవత్సరాలుగా నేనే చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించాను. అలాంటప్పుడు మరొకరి వ్యాఖ్యలను నేను జడ్జ్ చేయగలనని భావించడం లేదు' అని తప్పుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement