
బుజ్జాయితో ఇంటికి వచ్చిన హీరో
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తొలిసారి తండ్రి అయిన సంతోషంలో మునిగి తేలుతున్నాడు. తన చిన్నారి పాపను అపురూపంగా ఇంటికి తీసికెళ్తూ కనిపించాడు. షాహిద్ భార్య మీరా రాజ్పూత్ శుక్రవారం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తల్లీబిడ్డలు ఇంటికి చేరుకున్నారు.
మీరా ముందు నడుస్తుండగా.. పాపను ఎత్తుకుని షాహిద్ ఆమెను అనుసరించాడు. కెమెరా కంటపడకుండా తమ గారాలపట్టిని అతి జాగ్రత్తగా లోపలికి తీసికెళ్లాడు ఈ యువ హీరో. తల్లీబిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని షాహిద్ తల్లి నీలిమా అజీమ్ తెలిపారు. షాహిద్, మీరాలు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు.