ఐస్ బకెట్ చాలెంజ్. మానెక్విన్ చాలెంజ్ (ఫ్రీజ్ అయిపోయినట్టు నిల్చోవడం). ఇలా కొత్త కొత్త చాలెంజ్‌లు ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసేవి.. మరికొన్ని ఏదైనా మంచి పనికోసం చేసేవి. ఇప్పుడు నో స్ట్రా చాలెంజ్ అంటున్నారు ‘లవ్లీ’ ఫేమ్ శాన్వీ. నో స్ట్రా చాలెంజ్ అంటే కూల్‌డ్రింక్స్, కొబ్బరినీళ్లు తాగేటప్పుడు జనరల్‌గా స్ట్రా వాడుతూ ఉంటాం. దాన్ని పూర్తిగా కట్ చేయడమే నో స్ట్రా చాలెంజ్. ఈ నో స్ట్రా బ్యాక్‌స్టోరీ గురించి శాన్వీ మాట్లాడుతూ – ‘‘నా ఫ్రెండ్‌తో కలసి కొబ్బరినీళ్లు తాగుతుంటే స్ట్రా లేకుండా, నీళ్లు కిందపడకుండా తాగు చూద్దాం అని చాలెంజ్ చేసింది.
ఫస్ట్ రెండు మూడు అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యాను. ఇలా కొబ్బరి నీళ్లు కిందపడకుండా తాగటం నేర్చుకునే ప్రాసెస్‌లో ఇదో మంచి పనికి ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నాను. వెంటనే ‘నో స్ట్రా చాలెంజ్’ అంటూ సోషల్ మీడియాలో కొబ్బరి నీళ్లు కిందపడకుండా తాగే వీడియోను అప్‌లోడ్ చేశాను. అందరూ ఇది ఫాలో అయితే బావుంటుంది కదా అనిపించింది. ప్లాస్టిక్ వినియోగానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ పడేసేవాళ్ల మీద అరిచేస్తాను కూడా. మెల్లి మెల్లిగా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. బావుంది కదండీ.. ‘నో’ స్ట్రా చాలెంజ్‌కి ‘యస్’ చెప్పేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment