టాలీవుడ్‌లో యంగ్ హీరోలు వరుసగా గాయాలపాలవ్వటం ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది. వరుసగా సందీప్ కిషన్, నాగశౌర్య, శర్వానంద్‌లు గాయపడటం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల మీద ప్రభావం చూపిస్తోంది. శర్వానంద్ విషయంలో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రణరంగం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా అనుమానాలున్నాయి.
తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్, అదే సమయంలో శర్వానంద్‌కు ప్రమాదం జరగటంతో రిలీజ్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. శర్వా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో 96 రీమేక్ కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు. ఇక రణరంగం సినిమాను ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ లోపు శర్వా కోలుకొని ప్రచారంలో పాల్గొనటం అనుమానమే. ఈ పరిస్థితుల్లో చిత్రయూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment