ప్రేమలోన పడితినె | She Said YES: Daggubati Rana | Sakshi
Sakshi News home page

ప్రేమలోన పడితినె

May 13 2020 3:56 AM | Updated on May 13 2020 3:56 AM

She Said YES: Daggubati Rana - Sakshi

‘పడితినమ్మో పడితినమ్మో ప్రేమలోన పడితినే’ అంటూ ‘నేను నా రాక్షసి’లో ఇలియానా చుట్టూ తిరుగుతూ రానా పాట పాడుతుంటారు. ఇప్పుడు కూడా ఆ పాటే పాడుకుంటున్నారు. ఇది రియల్‌ లవ్‌. టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌ లో రానా ఒకరు. కొంత కాలంగా రానా రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటి? అంటే సమాధానం లేని ప్రశ్నే. అయితే ఈసారి అడక్కుండానే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు రానా. ప్రేమలో ఉన్నట్టు ఓ పోస్ట్‌ ద్వారా స్పష్టం చేశారు. మిహీకా బజాజ్‌తో  దిగిన ఓ సెల్ఫీని పోస్ట్‌ చేసి ‘తను నాకు యస్‌ చెప్పింది’  అని పేర్కొన్నారు రానా.

క్రసాల్‌ జ్యువెలర్స్‌ ఓనర్‌ బంటీ బజాజ్‌ కుమార్తె ఈ మిహీకా బజాజ్‌. ఆమె తండ్రి అసలు పేరు సురేష్‌ బజాజ్‌. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ బిజినెస్‌ లో ఉన్నారు మిహీకా. ఆమె పుట్టి, పెరిగింది హైదరాబాద్‌ లోనే. ముంబైలోని ఓ ప్రముఖ ఇన్‌ స్టిట్యూట్‌ లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ లో డిప్లొమా చేశారు. ఆ తర్వాత లండన్‌ లో ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ లో ఎంఏ చేశారామె. ఎప్పటినుంచి రానా, మిహీకా ప్రేమలో ఉన్నారనే విషయం బయటకు రాలేదు కానీ ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రానా తన ప్రేమ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న వెంటనే పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement