ఇక పారితోషికం ఇవ్వడానికి రెడీ! | Shocking Prefix Mrs for Nayantara | Sakshi
Sakshi News home page

ఇక పారితోషికం ఇవ్వడానికి రెడీ!

Published Sun, May 22 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

ఇక పారితోషికం ఇవ్వడానికి రెడీ!

ఇక పారితోషికం ఇవ్వడానికి రెడీ!

దక్షిణాదిన భారీ పారితోషికం తీసుకునే తారల్లో నయనతార ఒకరు. కోటికి పైగా డిమాండ్ చేస్తున్న ఈ మలయాళ మందారం ఇప్పుడు రివర్స్‌లో పారితోషికాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. విషయం ఏంటంటే.. నయనతార నిర్మాతగా మారనున్నారని చెన్నై కోడమ్‌బాక్కం వర్గాల సమాచారం. నచ్చిన కథలు దొరికితే, వాటిని నిర్మించడానికి ఈ మధ్య కొంత మంది కథానాయికలు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్‌లో అనుష్కా శర్మ ఇప్పటికే నిర్మాతగా మారి, ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రియాంకా చోప్రా కూడా ప్రొడ్యూసర్ అయ్యారు. మన తెలుగులో చార్మి ‘జ్యోతిలక్ష్మి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక, నయనతార విషయానికి వస్తే.. ఆ మధ్య ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (తెలుగులో ‘నేనూ రౌడీనే’) చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేశ్ శివన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కథానాయికగా నయనతార ఖరారయ్యారు. ఈ సినిమా కథ నచ్చడంతో కేవలం నటించడం మాత్రమే కాదు, నిర్మించాలని కూడా ఆమె నిర్ణయించుకున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement