శృతిహాసన్ లేడీ విలన్ కాదట
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయా' సినిమాలో శృతిహాసన్ నెగిటివ్ పాత్ర పోషించలేదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఆమె అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో శృతి నెగిటివ్ పాత్రలో నటించిందని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
రామయ్యా వస్తావయాలో శృతి ప్రత్యేక పాత్ర పోషించిందని హరీష్ తెలిపారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్లోనూ కమల్ తనయ నటించింది. తాజా చిత్రంలో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా మరో హీరోయిన్ సమంత నటించింది. నిర్మాత దిల్ రాజు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. కాగా శృతిహాసన్.. రామ్ చరణ్ సరసన నటించిన 'ఎవడు' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల కోసం శృతి ఆసక్తిగా ఎదురుచూస్తోంది.