పాత్ర నచ్చితే అతిథిగా కూడా చేస్తా : శ్రుతిహాసన్ | I will act in Cameo, if role attracts me, says Shruti Haasan | Sakshi
Sakshi News home page

పాత్ర నచ్చితే అతిథిగా కూడా చేస్తా : శ్రుతిహాసన్

Published Wed, Oct 16 2013 1:37 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పాత్ర నచ్చితే అతిథిగా కూడా చేస్తా : శ్రుతిహాసన్ - Sakshi

పాత్ర నచ్చితే అతిథిగా కూడా చేస్తా : శ్రుతిహాసన్

‘‘కథలో ప్రాధాన్యత ఉంటే... మంచి గుర్తింపు లభిస్తుందని నాకు నమ్మకం కుదిరితే... అయిదు నిమిషాల ప్రత్యేక పాత్రలో నటించడానికి కూడా నేను రెడీ’’ అంటున్నారు శ్రుతిహాసన్. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రుతి మాట్లాడుతూ ‘‘కథ, పాత్రే నాకు ముఖ్యం. 
 
 అందుకే అతిథి పాత్రలు చేయడానికి కూడా నిశ్చయించుకున్నాను’’ అన్నారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నానని, త్వరలోనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని శ్రుతిహాసన్ అన్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’లో అమ్ములు పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని శ్రుతి ఆనందం వ్యక్తం చేశారు. 
 
 ద్వితీయార్ధం కథను మలుపుతిప్పే పాత్ర కావడం వల్లే ఈ పాత్ర చేయడానికి అంగీకరించానని శ్రుతి తెలిపారు. ఎన్టీఆర్ మంచి డాన్సర్ అని కొనియాడారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించడం పట్ల శ్రుతి ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement