రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను' | Shweta menon's real delivery in 'Kalimannu' movie | Sakshi
Sakshi News home page

రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'

Published Fri, Oct 11 2013 12:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'

రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'

మలయాళంలో శ్వేతామీనన్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అలాగే తెలుగులో మూడు, నాలుగు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు అతిథి పాత్రలు చేశారామె. ఆ విధంగా ఈ మలయాళ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇటీవల ఆమె మలయాళంలో నటించిన చిత్రం ‘కలిమన్ను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీకిరణ్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులోకి విడుదల చేయనుంది.
 
 ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధినేత దేవికిరణ్ మాట్లాడుతూ -‘‘తన కలల్ని నిజం చేసుకోవడానికి కేరళ నుంచి ముంబయ్ వెళ్లిన ఓ అమ్మాయి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అవి ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమా సమయంలోనే శ్వేతామీనన్ ఓ పాపకు జన్మనిచ్చారు. 
 
 ఆమె డెలివరీని చిత్రీకరించి, ఈ సినిమాలో చూపించారు. కథ డిమాండ్ మేరకు చిత్రదర్శకుడు బ్లెస్సీ ఈ విధంగా చేశారు. శ్వేతామీనన్ అందచందాలు, అభినయం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే పాటలను, సినిమాని విడుదల చేయాలనుకుం టున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జయచంద్రన్, మాటలు: నౌండ్ల శ్రీనివాస్, సమర్పణ: బొడ్డు చంద్రశేఖరరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement