Shweta Menon
-
బిగ్‌బాస్‌లో ఆమెకు రోజుకు లక్ష రూపాయలు
ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్ షో దూసుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిగ్‌బాస్ రెండో సీజన్ నడుస్తుండగా.. మళయాళంలో బిగ్‌బాస్ తొలి సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా సాధారణ ప్రజల్లో నెలకొంది. మళయాళం బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16మంది సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు అందుతున్నాయని టాక్. బిగ్‌బాస్ నిర్వహకులు ప్రముఖ నటి శ్వేతా మీనన్‌కు హౌస్‌లో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగినన్ని రోజులు రోజుకు లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. మాజీ మిస్ కేరళ, ప్రముఖ యాంకర్ రంజిని హరిదాస్, శ్వేతా మీనన్ తర్వాతి స్థానంలో నిలిచారు. రంజినికి రోజుకు 80వేల రూపాయలు అందజేస్తున్నారు. మిగత కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్(రోజుకు) ప్రముఖ హాస్యనటుడు అనూప్ చంద్రన్- 71,000 నటి పర్ల్ మానే- 50,000 టీవీ నటి ఆర్చన సుశీలన్- 30,000 నటి హిమా శంకర్- 20,000 మిగతా కంటెస్టెంట్లు దీపన్, సాబు, మనోజ్ వర్మలు రోజుకు 10వేల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా మిగతా హౌస్ సభ్యులు శ్రీ లక్ష్మీ, దివ్య సన, సురేశ్, అదితి రాయ్, శ్రీనిష్ ఆరవింద్, బషీర్‌లు ఎంత తీసుకుంటున్నరనేది తెలియలేదు. -
ఆమెకి అతనే విలన్!
‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్‌తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు. -
శ్వేతామీనన్ నిరీక్షణ
హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. శ్వేతామీనన్ ముఖ్య పాత్రలో పర్స రమేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బసంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: అనిత్, సంగీతం: భోలే. -
షీ ఈజ్ వెయిటింగ్
మలయాళ నటి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో పర్స మహేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాం. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ిహీరో, ఇతర తారాగణం. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు. -
నాపై ఎటువంటి ఒత్తిడి లేదు:శ్వేతా మీనన్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73) పై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ తెలిపింది. కేసును వెనక్కి తీసుకోవడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని శ్వేతా తెలిపింది. గత కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఎంపీ కురుప్ అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మెట్టుదిగి వచ్చిన శ్వేతా మీనన్ గురువారం ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో కేసును వెనక్కి తీసుకోబోతున్నట్లు తెలిపింది. తనకు తానుగానే ఫిర్యాదును వెనక్కితీసుకుంటున్నానని, ఈ అంశంలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదని తెలిపింది. కాగా, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఆ రోజు జరిగిన పబ్లిక్ ఫంక్షన్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, వివాదాలను స్పష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని తాను ఎప్పుడూ కోరుకోనని తెలిపింది. అతని వయసుకు గౌరవమిచ్చి కేసును వెనక్కు తీసుకుంటున్నాని తెలిపింది. -
కేరళ కాంగ్రెస్ ఎంపీని వెంటాడుతున్న శ్వేతామీనన్ కేసు!
కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73)పై మలయాళ నటి శ్వేత మీనన్ చేసిన ఆరోపణలను ఆధారంగా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. స్థానిక కోర్టుకు నివేదించారు. తన పట్ల ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం కొల్లాం జరిగిన ప్రసిడెంట్స్ ట్రోఫి బోట్ రేస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా తన చేయి పట్టుకుని.. తనను పలుమార్లు తడిమారని కాంగ్రెస్ ఎంపీపై శ్వేత మీనన్ ఆరోపించింది. ఎంపీనే కాకుండా మరో వ్యక్తి కూడా తనతో అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు వెల్లడించింది. ఎంపీ, మరో వ్యక్తి వ్యవహరించిన తీరు తనకు మనస్తాపం కలిగించింది అన్నారు. ఆతర్వాత శ్వేత మీనన్ కు ఎంపీ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సమసిపోయింది. అయితే శ్వేత ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కారణంగా కోర్టుకు నివేదించారు. దాంతో మళ్లీ ఈ కేసు వెలుగులోకి వచ్చింది. -
శ్వేతా మీనన్‌పై అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎంపీ
-
శ్వేత మీనన్ ఆరోపణలపై ఎంపీ కురుప్ పై కేసు నమోదు!
తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73)పై కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొల్లాం లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 71 ఏళ్ల కురుప్ పై సెక్షన్ 354, 354(ఏ)ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రసిడెంట్ ట్రోఫి బోట్ రేస్ కార్యక్రమం సందర్భంగా మరో వ్యక్తి కూడా తనతో అనుచితంగా ప్రవర్తించారని శ్వేత మీనన్ ఆరోపించింది. సీపీఎం అనుబంధం సంస్థ డీవైఎఫ్ఐ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం శ్వేత మీనన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. పోలీసుల స్టేట్ మెంట్ ను రికార్డు చేసే సందర్భంలో శ్వేత మీనన్ భోరున విలపించింది. -
కన్నీళ్లు పెట్టిన శ్వేతా మీనన్
కొచ్చి: కొల్లాం లోక్‌సభ సభ్యుడు ఎన్ పితాంబర కురుప్(73) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కొల్లాం నుంచి వచ్చిన పోలీసుల బృందం ఈ ఉదయం 9 గంటలకు శ్వేతా మీనన్ నివాసంలో ఆమె వాంగూల్మం నమోదు చేసింది. ఈ సందర్భంగా శ్వేతా మీనన్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. రెండు రోజుల క్రితం కొల్లాంలో జరిగిన పడవల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కురుప్, శ్వేతా మీనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పట్ల కురుప్ అభ్యంతర కరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ నిన్న ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమెన్ చాందీకి లేఖ కూడా రాశారు. మంగళవారం ముఖ్యమంత్రిని ఆమె కలవనున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోత్సాహంతోనే తాను ఆరోపణలు చేశానని కురుప్ వ్యాఖ్యనించడాన్ని ఆమె కొట్టి పారేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. -
ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించారు: నటి శ్వేతా మీనన్
కొల్లాం లోక్‌సభ సభ్యుడు పితాంబరం కురుప్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ శనివారం కొచ్చిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. కొల్లాంలో నిన్న సాయంత్రం పడవల పోటీ విజేతలకు ప్రెసిడెంట్స్ ట్రోఫీ బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన పట్ల ప్రవర్తించిన తీరుకు సంబంధించిన మీడియా పూటేజ్‌లను ఆమె ప్రదర్శించారు. ఆయనపై చర్యల కోసం మలయాళ చిత్ర పరిశ్రమను సంప్రదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. శ్వేత మీనన్ ఆరోపణలతో మలయాళీ చిత్ర పరిశ్రమ అగ్ని మీద గుగ్గిలమైంది. పితాంబరంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అటు మలయాళీ చిత్ర పరిశ్రమ ఇటు మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే శ్వేత మీనన్ ఆరోపణలను లోక్‌సభ సభ్యుడు పితాంబరం (73) తీవ్రంగా ఖండించారు. ఓ మీడియా వర్గం కావాలనే తనపై ఇలా విష ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆ సంఘటన అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఆ విషయంలో తాను అమాయకుడినని చెప్పారు. తన నిర్దోషత్వాన్ని తర్వలో నిరూపించుకుంటానని వెల్లడించారు. శ్వేత మీనన్ ఆరోపణలను సు మోటోగా స్వీకరించి, విచారణ చేపడుతున్నట్లు కేరళా మహిళ హక్కుల సంఘం అధ్యక్షురాలు లిసీ జోస్ వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. -
రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'
మలయాళంలో శ్వేతామీనన్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అలాగే తెలుగులో మూడు, నాలుగు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు అతిథి పాత్రలు చేశారామె. ఆ విధంగా ఈ మలయాళ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇటీవల ఆమె మలయాళంలో నటించిన చిత్రం ‘కలిమన్ను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీకిరణ్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధినేత దేవికిరణ్ మాట్లాడుతూ -‘‘తన కలల్ని నిజం చేసుకోవడానికి కేరళ నుంచి ముంబయ్ వెళ్లిన ఓ అమ్మాయి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అవి ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమా సమయంలోనే శ్వేతామీనన్ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆమె డెలివరీని చిత్రీకరించి, ఈ సినిమాలో చూపించారు. కథ డిమాండ్ మేరకు చిత్రదర్శకుడు బ్లెస్సీ ఈ విధంగా చేశారు. శ్వేతామీనన్ అందచందాలు, అభినయం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే పాటలను, సినిమాని విడుదల చేయాలనుకుం టున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జయచంద్రన్, మాటలు: నౌండ్ల శ్రీనివాస్, సమర్పణ: బొడ్డు చంద్రశేఖరరావు.