శ్వేత మీనన్ ఆరోపణలపై ఎంపీ కురుప్ పై కేసు నమోదు! | Shweta Menon Molestation: Police register case against Congress MP N Peethambara Kurup | Sakshi
Sakshi News home page

శ్వేత మీనన్ ఆరోపణలపై ఎంపీ కురుప్ పై కేసు నమోదు!

Published Sun, Nov 3 2013 6:03 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

శ్వేత మీనన్ ఆరోపణలపై ఎంపీ కురుప్ పై కేసు నమోదు! - Sakshi

శ్వేత మీనన్ ఆరోపణలపై ఎంపీ కురుప్ పై కేసు నమోదు!

తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73)పై కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కొల్లాం లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 71 ఏళ్ల కురుప్ పై సెక్షన్ 354, 354(ఏ)ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రసిడెంట్ ట్రోఫి బోట్ రేస్ కార్యక్రమం సందర్భంగా మరో వ్యక్తి కూడా తనతో అనుచితంగా ప్రవర్తించారని శ్వేత మీనన్ ఆరోపించింది. 
 
సీపీఎం అనుబంధం సంస్థ డీవైఎఫ్ఐ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం శ్వేత మీనన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. పోలీసుల స్టేట్ మెంట్ ను రికార్డు చేసే సందర్భంలో శ్వేత మీనన్ భోరున విలపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement