కేరళ కాంగ్రెస్ ఎంపీని వెంటాడుతున్న శ్వేతామీనన్ కేసు!
కేరళ కాంగ్రెస్ ఎంపీని వెంటాడుతున్న శ్వేతామీనన్ కేసు!
Published Wed, Nov 6 2013 7:35 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73)పై మలయాళ నటి శ్వేత మీనన్ చేసిన ఆరోపణలను ఆధారంగా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. స్థానిక కోర్టుకు నివేదించారు. తన పట్ల ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే.
గత శుక్రవారం కొల్లాం జరిగిన ప్రసిడెంట్స్ ట్రోఫి బోట్ రేస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా తన చేయి పట్టుకుని.. తనను పలుమార్లు తడిమారని కాంగ్రెస్ ఎంపీపై శ్వేత మీనన్ ఆరోపించింది. ఎంపీనే కాకుండా మరో వ్యక్తి కూడా తనతో అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు వెల్లడించింది. ఎంపీ, మరో వ్యక్తి వ్యవహరించిన తీరు తనకు మనస్తాపం కలిగించింది అన్నారు.
ఆతర్వాత శ్వేత మీనన్ కు ఎంపీ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సమసిపోయింది. అయితే శ్వేత ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కారణంగా కోర్టుకు నివేదించారు. దాంతో మళ్లీ ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Advertisement
Advertisement