
సిక్స్ ప్యాక్... హృతిక్!
కండలు తిరిగిన హృతిక్ రోషన్ దేహానికి మళ్లీ ‘సిక్ ప్యాక్’ ఏంటా అనుకుంటున్నారా?
కండలు తిరిగిన హృతిక్ రోషన్ దేహానికి మళ్లీ ‘సిక్ ప్యాక్’ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఇది ఓ ఆల్బమ్ టైటిల్. దీంట్లో విశేషం ఏముందనుకుంటున్నారా? ఇది ఓ ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన వీడియో.‘ సిక్స్ ప్యాక్’ అనే పేరుతో కొంతమంది ట్రాన్స్‌జెండర్లు మూడేళ్లుగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రూపొందిస్తున్నారు.
వీరి గురించి తెలుసుకున్న హృతిక్ తనకు తానుగా ఈ బ్యాండ్ వాళ్లను సంప్రతించి, అందులో భాగం కావడానికి సిద్ధమయ్యారు. వీరి మీద సమాజ దృక్పథాన్ని మార్చాలన్న ఉద్దేశంతో దీంట్లో ట్రాన్స్‌జెండర్స్‌తో నర్తించడానికి సై అన్నారట. హృతిక్ తనకు తానుగా దీంట్లో భాగం కావడంతో ‘సిక్స్ ప్యాక్’ బృందం ఆనందానికి అవధులు లేవు.