అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది.
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ ట్రైలర్ శనివారం సాయంత్రం విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తుండటం, నాగార్జున సరసన ఓ కథానాయికగా రమ్యకృష్ణ జత కట్టడంతో సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. మనం సినిమా తర్వాత నాగార్జున చాలాకాలం గ్యాప్ తీసుకోవడంతో ఈ సినిమా విడుదలకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండబోతుంది.
Here's the theatrical trailer of #SoggadeChinniNayana for you online/coming this SANKRANTHI!!https://t.co/VUskFg0Eey pic.twitter.com/K86E0LNL6L
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 12, 2015