సల్మాన్ ఖాన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు: సోనాక్షి సిన్హా | Sonakshi Sinha says Salman Khan is not upset with her | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు: సోనాక్షి సిన్హా

Published Sun, Nov 17 2013 11:25 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ ఖాన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు: సోనాక్షి సిన్హా - Sakshi

సల్మాన్ ఖాన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు: సోనాక్షి సిన్హా

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు, తనకు ఎలాంటి వివాదాలూ లేవని యువ కథానాయిక సోనాక్షి సిన్హా చెబుతోంది. తన వల్ల సల్మాన్ ఎప్పుడూ ఇబ్బంది పడలేదని చెప్పింది. తనపై సల్మాన్ కోపంగా ఉన్నాడంటూ వచ్చిన వార్తల్ని సోనాక్షి తోసిపుచ్చింది. సూపర్ హిట్ చిత్రం 'దబాంగ్'లో సల్మాన్కు జోడీగా సోనాక్షి అరంగేట్రం చేసింది. దీనికి సీక్వెల్ చిత్రంలోనూ నటించింది.

సల్మాన్ హీరోగా ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మించే చిత్రంలోనూ హీరోయిన్గా సోనాక్షికి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అయితే సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. సోనాక్షిని సల్మానే తప్పించినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో సోనాక్షి స్పందిస్తూ తమ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవని, సత్సంబంధాలున్నాయని చెప్పింది. 'సల్మాన్ ఇబ్బంది పడినట్టయితే అతన్నే అడగండి. అంతేకానీ నన్ను కాదు. మీడియాలో వార్తలు వచ్చినట్టుగా ఏమీ జరగలేదు' అని సోనాక్షి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement