మణిరత్నం సినిమాకి ‘నో’! | Sonakshi Sinha turns down Mani Ratnam's film | Sakshi
Sakshi News home page

మణిరత్నం సినిమాకి ‘నో’!

Published Sat, Feb 15 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

మణిరత్నం సినిమాకి ‘నో’!

మణిరత్నం సినిమాకి ‘నో’!

 అదృష్టం ముందు తలుపు తడితే, దురదృష్టం వెనక తలుపు తట్టిందని తెగ బాధపడిపోతున్నారు సోనాక్షి సిన్హా. ఆమె బాధకు కారణం మణిరత్నం సినిమాకి డేట్స్ కేటాయించలేకపోవడమే. మహేష్‌బాబు, నాగార్జున కాంబినేషన్‌లో మణిరత్నం ఓ సినిమాకి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, శ్రుతిహాసన్‌లను నాయికలుగా ఎంపిక చేశారట. మరో నాయికగా సొనాక్షీ అయితే బాగుంటుందని, ఆమెను సంప్రదించారట. స్టోరీలైన్ కూడా సోనాక్షికి వినిపించారట.
 
 ఆ కథ, తన పాత్ర బాగా నచ్చినా ఈ చిత్రాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరామె. డైరీ చెక్ చేసుకుంటే, డేట్స్ ఖాళీ లేవట. దాంతో, బంగారంలాంటి ఈ అవకాశాన్ని వదులుకున్నారట. ఈ నెల ఈ అవకాశం వదులుకున్న సోనాక్షీ గత నెల సుభాష్ ఘయ్ ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించారు. ఎలాంటి నేరం చేయకుండానే పాకిస్తానీ జైలులో 22 ఏళ్లు శిక్ష అనుభవించిన సరబ్‌జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఘయ్ ఈ సినిమా చేయాలనుకున్నారు. నరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రకు సోనాక్షీని అడిగారు. అయితే డేట్స్ ఖాళీ లేక ఆ అవకాశాన్ని వదులుకున్నారామె. ఇలా రెండు నెలల గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు వదులుకోవాల్సి రావడం సోనాక్షీని కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement