ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు! | sridevi daughter jhanavi acting debut in ntr film! | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు!

Published Thu, Oct 29 2015 2:38 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు!

ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు!

తన కూతురి సినీరంగ ప్రవేశం ఇప్పట్లో ఉండదంటూ స్వయంగా అందాల తార శ్రీదేవి ప్రకటించినా, జాహ్నవి తెరంగేట్రంపై వార్తలు మాత్రం ఆగటం లేదు. శ్రీదేవి రీఎంట్రీ తరువాత జాహ్నవి సినీరంగ ప్రవేశంపై మరోసారి వార్తలు ఊపందుకున్నాయి. బాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు సౌత్ నుంచి కూడా ఈ అందాల భామను పరిచయం చేస్తామంటూ ప్రపోజల్స్ వచ్చాయి.

గతంలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాతో  జాహ్నవి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు బలంగా వినిపించాయి. అయితే అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది శ్రీదేవి. అంతేకాదు జాహ్నవి ప్రస్తుతం చదువుకుంటుందని ఇప్పట్లో సినిమాల్లో నటించే ఆలోచన లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ఈ వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడినా మరోసారి జాహ్నవి ఎంట్రీ పై చర్చ మొదలైంది.

త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన జాహ్నవి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) సినిమాతో జాహ్నవిని హీరోయిన్గా పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే శ్రీదేవిని సంప్రదించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ సారైనా అతిలోక సుందరి వారసురాలి ఎంట్రీ కన్ఫామ్ అవుతుందో లేక మరోసారి గాసిప్ అంటూ కొట్టి పారేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement