
సాక్షి, న్యూఢిల్లీ : అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్ర ఇక పుస్తక రూపంలో రానుంది. ‘శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే టైటిల్‌తో ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుసక్తానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట రాయడం విశేషం. ‘ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’అంటూ కాజోల్ ట్వీట్ చేశారు.
శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment