నాది కానిది... నాది అని చెప్పుకోలేను! | 'Subramanyam for Sale' is for families | Sakshi
Sakshi News home page

నాది కానిది... నాది అని చెప్పుకోలేను!

Published Wed, Sep 23 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

నాది కానిది... నాది అని చెప్పుకోలేను!

నాది కానిది... నాది అని చెప్పుకోలేను!

డెరైక్టర్ హరీశ్‌శంకర్...
ఈ పేరు వినగానే ‘షాక్’ లాంటి వెరైటీ ఫిల్మ్...
గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్... ‘రామయ్యా వస్తావయ్యా
లాంటి అట్టర్‌ఫ్లాప్... ఇలా రకరకాల ఇమేజెస్.
కానీ, ఆ ఇమేజ్ లకు లొంగకుండా
ఏదైనా ముక్కుసూటిగా, ఇంకా చెప్పాలంటే ముక్కు మీద గుద్దినట్లు చెప్పే
ఈ డెరైక్టర్ ఇప్పుడు ‘
సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటున్నారు.
ఆయనతో ‘
సాక్షి’ భేటీ...
 
మొత్తానికి, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో దర్శకుడిగా మిమ్మల్ని మీరు మళ్ళీ సేల్‌లో పెట్టుకున్నట్లున్నారు!
(నవ్వేస్తూ...) ప్రతి సినిమాకూ మనల్ని మనం సేల్‌లో పెట్టుకోవాల్సిందే. ఏ కథకైనా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అది  ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మనం బెస్ట్ ఇచ్చినట్టు! లేకపోతే ఇవ్వనట్టు!
 
కానీ, దాదాపు రెండేళ్ళ గ్యాప్ వచ్చిందే!  
ఏ సినిమాకైనా అంతే కష్టం. ‘గబ్బర్‌సింగ్’కూ రెండేళ్లు తీసుకున్నా.‘రామయ్యా వస్తావయ్యా’కూ ఇలాగే కష్టపడ్డా. తీరా ‘రామయ్యా..’ ఫ్లాప్ అవడంతో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు పట్టిన టైమ్ గురించి ‘సినిమాలు లేవేమో’ అని మాట్లాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యదేశం కాబట్టి వాటిని ఖండించాల్సిన అవసరం లేదు.
 
ఫ్లాప్ వచ్చాక పెద్ద హీరోలు చాన్స్‌లి వ్వక, చిన్న హీరోతో చేశారా?
అదేమీ లేదు. ‘రామయ్యా’ ఫ్లాపైన వెంటనే, అల్లు అర్జున్ నాకు ఫోన్ చేసి, సినిమా చేద్దామన్నారు. అయితే, మళ్ళీ పెద్ద హీరోతో సినిమా, అందులోనూ ఫ్లాప్‌లో ఉన్న దర్శకుణ్ణి అనగానే దానికి పడే శ్రమ, ఒత్తిడి ఎక్కువ. పైగా, ‘సుబ్రమ ణ్యం ఫర్ సేల్’ కథ ఒక పెద్ద హీరోతో చేసే స్క్రిప్ట్ కాదు. అందుకే, సాయిధరమ్ తేజ్‌తో చేశా. అంతేతప్ప, నాకు అవకాశం ఇవ్వలేదనో, మరొకటనో ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి కాదు. అలాంటి సీన్లు సినిమాల్లో బాగుంటాయి కానీ, నిజజీవితంలో కుదరదు.  
 
అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథే ఇదన్నారే!
అది నిజం కాదు. ఇది ఎప్పుడో రాసుకున్న కథ. కొత్తగా సినిమాలు తీస్తున్న రోజుల్లో నచ్చిన ట్టల్లా కథలు రాసుకుంటూ ఉండేవాడిని. హీరోకు తగ్గట్టు కథలు రాసేంత లౌక్యం అప్పట్లో లేదు. ఎవరికి నచ్చుతుందా అని తిరిగేవాణ్ణి. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘మిరపకాయ్’ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. తర్వాత ‘గబ్బర్‌సింగ్’, ‘రామయ్యా...’ చేయడంతో ఇది తీయడం ఇప్పటికి కుదిరింది.
 
ఈ సినిమాకూ, ‘మొగుడు కావాలి’కీ పోలికలుంటాయని బయట ప్రచారం!
‘మిస్సమ్మ’, ‘మొగుడు కావాలి’, ‘బావగారూ! బాగున్నారా’ - ఇలా చాలా సినిమాల్లో హీరో ఓ హీరోయిన్ కథలోకి ఎంటర వుతాడు. ఇలా చాలా సినిమాల్లోని ప్యాట్రన్‌లోనే ఇదీ ఉంటుంది.
 
ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్త్వం ఎవరి దగ్గర నేర్చారు?
మా నాన్నగారు తెలుగు మాస్టారు. ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన చాలా హైపర్. విపరీతమైన  వ్యంగ్యం! నాకు చిన్నతనం నుంచి ఎండలోకెళితే, ముక్కు వెంట రక్తం కారేది. అందుకే ఇంట్లోనే ఉంచి, లైబ్రరీ అంతా చదివించేశారు. నేనీ స్థాయిలో ఉన్నానంటే నాన్నగారే కారణం.
 
ఫాదర్ సెంటిమెంట్ మీద సినిమా తీయాలనినిపించిందా?
ఏదైనా కథ డిమాండ్ చేయాలి. ఏ హీరోకి ఏ కథ సూట్ అవుతుందా అని ఆలోచించి రాసు కోవాలి. నేను అద్భుతమైన కథలు రాయడం కన్నా, అందరికీ అర్థమయ్యే కథలు రాయాలనుకుంటా.
 
‘గబ్బర్‌సింగ్’  టైమ్‌లో డైలాగ్స్ ఎవరో రాశారన్న వార్తలు వచ్చాయి. అవి నిజమేనా?
గబ్బర్‌సింగ్‌లో ప్రతి అక్షరం నేను రాసుకున్నదే. ఒక్క బ్రహ్మానందం గారి డైలాగ్ ‘‘నేను ఆయుధాలతో  చంపను, వాయిదాలతో చంపుతా’’ అనేది మా కోడెరైక్టర్ కృష్ణారెడ్డి సజెస్ట్ చేశారు. దాంతో అతని పేరు రచనా సహకారం అని వేశా. నాది కాని దాన్ని నాది చెప్పుకోవడానికి ఇష్టపడను. ఘోస్ట్ రైటర్‌గా నాకెవరూ క్రెడిట్ ఇవ్వలేదని ఏడ్చేసిన రాత్రుళ్ళు చాలానే.
 
అంత హిట్టిచ్చినా ‘గబ్బర్‌సింగ్ ’ సీక్వెలెందుకు చేయట్లేదు?
‘గబ్బర్‌సింగ్ ’ ఓ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. కానీ ‘గబ్బర్ సింగ్-2’కు మాత్రం ముందు సినిమాను దృష్టిలో పెట్టుకుని వస్తారు. మళ్లీ అద్భుతం రిపీట్ అవుతుందో లేదో చెప్పలేం.  సో... ప్రెషర్ చాలా ఉంటుంది. పైగా ఫస్ట్ టైమ్ కాబట్టి దర్శకుడు బాబీ నా కన్నా ఫ్రెష్‌గా డీల్ చేస్తాడు. ఒకసారి దర్శనం అయిపోయాక. మళ్లీ లైన్‌లో నిల్చొని దర్శనం కావాలనుకోవడం స్వార్థం అవుతుంది.
 
పవన్‌కల్యాణ్‌కూ, మీకూ మధ్య విభేదాలు వచ్చాయని...
అందులో నిజం లేదు. నేను ఆయనను ఇష్టపడే వ్యక్తిని. విభేదాలు పెట్టుకునే స్థాయి, అర్హత నాకు లేవు.  

మీ షార్ట్ టెంపర్‌తో ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా?
చాలా చేశా. వాటిని అధిగమించడమేగా జీవితం.
 
ఈ సినిమాలో హీరోయిన్‌తో ఇంటిమేట్ సీన్లున్నాయని..
(నవ్వేస్తూ...) అన్ని సీన్స్ ఉంటే ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చేది. కానీ యు/ఎ వచ్చింది. అదీ ఫైట్స్ వల్లే. రొమాంటిక్ సీన్స్ కూడా అంతా చూసేలా ఉంటాయి.  
 
చిరంజీవి సాంగ్ ‘గువ్వా గోరింకతో...’ రీమిక్స్ గురించి?
ప్రతి సినిమాలో ఇంటర్వెల్ ముందు హుషారైన పాట ఉండాలనుకుంటా. ‘మిరపకాయ్’లో ‘చిలకా...’, ‘గబ్బర్‌సింగ్’లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఉంటాయి. ఈ సినిమాలో ‘యాష్ కరేంగే...’ పాట పెట్టా. సెకడాంఫ్‌లో వచ్చే పాటకి ఈ రీమిక్స్ వాడాం.  
 
ఇలా లెక్కలేసుకొని తీస్తే హిట్ ఫార్ములానా?
పాట పెట్టాలనేది నా ప్యాట్రనే తప్ప ఫార్ములా కాదు. సక్సెస్ ఫార్ములా తెలిస్తే, అన్నీ హిట్టవుతాయిగా. ఏమైనా, ఇది హీరో బేస్డ్ ఇండస్ట్రీ.
     
మీలాంటి కొంత మంది డైరక్టర్ బేస్డ్ ఇండస్ట్రీగా మార్చారు కదా?
లేదండి. ‘రామయ్య...’ ఫ్లాప్ తర్వాత హరీశ్‌కు సినిమాలు ఎవరిస్తారని అన్నారే గానీ ఎన్టీఆర్‌కు ఎవరిస్తారు అని అనుకున్నారా? ఫ్లాప్ అయినప్పుడు  డైరక్టర్లదే ఫాల్ట్ గానీ హీరోలది కాదు. హీరో వంద మందిని నరికితే కానీ, 80 ఏళ్ళ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టరివ్వని ఆడియన్స్ అభిరుచి మేరకే సినిమా తీయాలి. మాది వాళ్ళ మీద రుద్దకూడదు. నచ్చిన పనే చేస్తున్నా, రాజీ పడక తప్పదు. డైరక్టర్ శంకర్‌ని ‘ఎప్పుడైనా రాజీపడ్డారా’ అంటే, ‘రోబోకు మరో 30 కోట్లు బడ్జెట్ ఉంటే ఇంకో లెవల్‌కు తీసుకెళ్లేవాడి’నన్నారు.
 
మీ తాజా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ మీద కానీ, మీ ఇతర చిత్రాల మీద కానీ ఉన్న ప్రభావం?
‘అయామ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్’ అని ఇంగ్లీషు మాట. అలాగే నేను చూసిన చాలా సినిమాలు, చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావం నా సినిమాలపై ఉంది.
   
మరి, మీ ఆలోచనా విధానం మీద ఎవరి ప్రభావం ఉంటుంది?
యండమూరి, షారుక్‌ఖాన్, రవితేజల ప్రభావం ఉంటుంది. షారుక్ ఎనర్జీ అంటే ఇష్టం. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ నుంచి చలం, మల్లాది - అందరి పుస్తకాలూ చదివాను.
     
మళ్ళీ చిన్న ఎన్టీయార్‌తో సినిమా ఛాన్స్ వస్తే...?
ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు చేస్తా. అలాంటి పెద్ద హీరో ఇచ్చిన అవకాశాన్ని ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సరిగ్గా వాడుకోలేకపోయాననే బాధ నాలో ఉంది.
     
ఇంతకీ ఆ సినిమా ఎందుకు ఆడలేదంటారు?
చాలా కారణాలే ఉన్నాయి. కానీ, ఆ ఫెయిల్యూర్‌కి బాధ్యత నాదే. సక్సెస్ నుంచి నేర్చుకోకపోయినా ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలిగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement