జ్ఞాపకాల మధురానుభూతులు... | Sudheer Babu's Krishnamma Kalipindi Iddarini movie | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల మధురానుభూతులు...

Published Sat, Nov 22 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

జ్ఞాపకాల మధురానుభూతులు...

జ్ఞాపకాల మధురానుభూతులు...

‘ప్రేమకథాచిత్రమ్’ జంట సుధీర్‌బాబు, నందిత కలిసి నటించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. చంద్రు దర్శకత్వంలో లగడపాటి శిరీషాశ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. డిసెంబర్ తొలివారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శిరీషాశ్రీధర్ మాట్లాడుతూ -‘‘జ్ఞాపకాల మధురానుభూతులే ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.

కన్నడంలో మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్న చంద్రు... ఈ చిత్రాన్ని ఓ కావ్యంలా మలిచాడు. హరి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా సంస్థ స్థాపించి పదేళ్లు కావొస్తోంది. ఈ సందర్భంలో వస్తున్న ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకొని మా సంస్థ ప్రతిష్ఠను పెంచుతుందని మా నమ్మకం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement