సుకుమార్తో శర్వా
సుకుమార్తో శర్వా
Published Tue, Apr 19 2016 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్న ఈ యంగ్ హీరో, త్వరలో ఓ క్రియేటివ్ డైరెక్టర్తో కలిసి పనిచేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలతో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్తో సినిమా చేయనున్నాడు యంగ్ హీరో శర్వానంద్.
అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు కాదు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పిన సుక్కూ, ఆ బ్యానర్పై కుమార్ 21ఎఫ్ సినిమాను తెరకెక్కించి ఘనవిజయం సాధించాడు. ఇప్పడు అదే బ్యానర్లో శర్వానంద్ హీరోగా సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. మరోసారి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలోనే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట సుకుమార్. అంతేకాదు కుమార్ 21ఎఫ్ తరహాలోనే కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమారే అందించనున్నాడు.
Advertisement
Advertisement