Kumari 21 F
-
ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్ అయ్యాను: భానుశ్రీ
శ్రీనగర్‌కాలనీ: నా అసలు పేరు స్వప్న. డ్యాన్సర్‌గా ఎదిగాక భానుశ్రీగా మార్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవుతానని ఇంట్లో చెప్పాను. అయితే ఒప్పుకోలేదు. దాంతో నేను దాచుకున్న కొంత డబ్బుతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశాను. నేను ముక్కుసూటి మనిషిని.. దేనికీ భయపడను. నా వ్యక్తిత్వాన్ని నమ్ముతూ నిజాయతీగా ముందుకెళ్తాను. నాకు తెలిసిన వాళ్ల ద్వారా డ్యాన్సర్ కార్డ్ తీసుకున్నాను. తెలిసిన అమ్మాయితో కలిసి రూమ్ తీసుకొని ఉన్నాను. కొన్ని రోజులకు నా గొలుసు ఎవరో దొంగతనం చేశారు. బాధతో రూమ్ నుంచి వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. డ్యాన్సర్‌గా శక్తి, డార్లింగ్ తదితర సినిమాలకు పనిచేశాను. సీరియల్.. సినిమా డ్యాన్సర్‌గా ఎదిగాక కొన్ని షోలలో పాల్గొన్నాను. తర్వాత జాబిలమ్మ సీరియల్లో లీడ్ రోల్ చేశాను. బాహుబలి సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులో తమన్నా స్నేహితురాలిగా నటించాను. బాహుబలి తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కాటమరాయుడు, సుబ్రమణ్యం ఫర్ సేల్, మహానుభావుడు తదితర చిత్రాల్లో నటించాను. పెద్ద సినిమాల్లో నటించడంతో చిన్న సినిమాల్లో హీరోయిన్గా అవకాశం లభించింది. ఇద్దరి మధ్య 18, మౌనం, ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. బాహుబలి సినిమాలో నటించాక వరంగల్‌లో నాకు సన్మానం చేశారు. ‘సినిమాల్లో వద్దు. నీకు చాన్స్‌లు రావు’ అన్నవాళ్లే నన్ను అభినందిస్తూ సన్మానం చేయడం సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ మూవీలో హీరోయిన్గా చేస్తున్నాను. నేనే ప్రపోజ్ చేశా... డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డితో పరిచయమైంది. తనది కడప. నిజాయతీగా ఉండేవాడు. కష్టాల్లో తోడుగా ఉండి భరోసా ఇచ్చాడు. స్టైలింగ్‌లో సూచనలిస్తూ స్నేహితుడిగా మారాడు. శివ వ్యక్తిత్వం, ఆప్యాయత నచ్చాయి. కొన్ని రోజులకు నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పాను. శివతోనే నా ప్రయాణం. శివ తోడు నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. నా స్వీయ తప్పిదం... బిగ్‌బాస్‌లో అవకాశం రావడం నా అదృష్టం. అందులో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. చాలామంది ఇది గేమ్ డైరెక్షన్ అనుకుంటారు. కానీ నిజాయతీగా ఉండే రియాల్టీ షో. ప్రతిరోజూ నూతనంగా ఉండేది. కొత్త టాస్క్‌లతో ఉత్సాహంగా గడిపేవాళ్లం. నా ముక్కుసూటి తనంతో షోలో నన్ను అభిమానిస్తూ సన్నిహితంగా ఉండేవారు. బిగ్‌బాస్‌లో నెలరోజులకు పైగా ఉండడం సంతోషంగా అనిపించింది. ఓ టాస్క్‌లో కౌషల్‌తో చిన్న వాగ్వాదం జరిగింది. నా స్వీయ తప్పిదంతోనే వాగ్వాదం పెద్దదైంది. దీంతో నాకు మైనస్ మార్క్స్ పడ్డాయి. -
కన్నడంలో కుమారి
‘‘నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐయామ్ ఎ ఫీమేల్. ఏం.. నన్ను లవ్ చేయటానికి నేను సరిపోనా. నా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కావాలా...’’ అంటూ ‘కుమారి 21ఎఫ్’ సినిమాలో హెబ్బా పటేల్ పలికిన సంభాషణలను ఎవరూ మర్చిపోలేరు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ‘కుమారి 21ఎఫ్’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కన్నడంలో అదే టైటిల్‌తో రీమేక్ అయింది. హెబ్బా పటేల్ పోషించిన కుమారి పాత్రను నిధి కుశలప్ప పోషించారు. కుమారి బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ పాత్రలో ప్రణామ్ దేవరాజ్ నటించారు. అవినాష్, మనోజ్, అక్షయ్, రితేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను సంపత్ కుమార్, శ్రీధర్ సంయుక్తంగా నిర్మించగా శ్రీమన్ వేముల దర్శకత్వం వహించారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. -
అప్పుడు మా ఆవిడ చంపేస్తుంది!
‘‘నేను నిర్మాతగా వ్యవహరించే సినిమాల చిత్రీకరణలకు అస్సలు వెళ్లను. నేనొక్క రోజు సెట్‌కు వెళ్లినా ఆ సినిమా సుకుమారే డైరెక్ట్ చేశాడంటారు. పైగా, నాకో విజన్ ఉంటుంది. ఆయా దర్శకులకు వేరే విజన్ ఉంటుంది. నేనేదో ఉచిత సలహా ఇచ్చి, వాళ్ల కష్టాన్ని తక్కువ చేయడం ఎందుకు? అందుకే, ‘కుమారి 21ఎఫ్’ సెట్‌కి గానీ, ఈ ‘దర్శకుడు’ సెట్‌కి గానీ వెళ్లలేదు’’ అన్నారు సుకుమార్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి ఆయన నిర్మించిన ‘దర్శకుడు’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుకుమార్ చెప్పిన విశేషాలు... ‘దర్శకుడు’ ఎలా ఉన్నాడు? ఓ ప్రేక్షకుడిగా చూశా. చాలా బాగున్నాడు. సినిమా చూసినప్పుడు కొన్నిసార్లు మనకు రిజల్ట్ తెలుస్తుంది. లేదంటే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేం! అందమైన ప్రేమకథా చిత్రమిది. నా తరహా సినిమా కాదు. తెరపై దర్శకుణ్ణి చూసినప్పుడు మీకు మీరు గుర్తొచ్చారా? లేదు. నా కథ కాదిది. అందులో నా పాత్ర ఏం లేదు. సెట్లో కాస్ట్యూమ్ డిజైనర్‌తో ప్రేమలో పడ్డ దర్శకుడి కథ. (నవ్వుతూ...) నేనలా చేస్తే మా ఆవిడ చంపేస్తుంది కాబట్టి... నాకలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. హీరోగా చేసిన మీ అన్న కొడుకు అశోక్ బాడీ లాంగ్వేజ్ మీలాగే ఉందట? ఏదైనా పాత్రలో నటించేటప్పుడు అలాంటి వ్యక్తులను అబ్జర్వ్ చేస్తారు కదా. అందులోనూ దర్శకుడి పాత్ర. తనకు ఎక్కువ తెలిసిన దర్శకుణ్ణి, కళ్ల ముందున్నది నేనే. కొన్నిసార్లు నాకు కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్నది విసిరేస్తా. అటువంటి సీన్స్‌లో ‘చిన్నాన్న అయితే ఎలా చేస్తాడు?’ అని ఊహించుకుని చేశాడేమో! నిజం చెప్పాలంటే... సీరియస్ ఎమోషనల్ సీన్స్‌లో అనుభవమున్న నటుడిలా అశోక్ బాగా చేశాడు. మీ లైఫ్‌లోంచి ఓ సీన్ కాపీ చేశానని హరిప్రసాద్ అన్నారు. ట్రైలర్‌లోని ఆ సీన్ చూసి మీ వైఫ్ ఏమన్నారు? (నవ్వుతూ...) ‘నా సీన్ కాపీ కొట్టేశావ్’ అని తిట్టింది. ఫస్ట్‌లో తనకు సినిమాల గురించి ఏం తెలీదు. ఆమెది హైదరాబాద్. ఎక్కువ హిందీ సినిమాలు చూసేది. నా సిన్మాలు చూడలేదు. ‘డైరెక్షన్ అంటే నువ్వేం చేస్తావ్’ అనడిగింది. తన డౌట్ ఏంటంటే... ‘డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ చేస్తాడు, ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తాడు, ఇలా అందరూ అన్నీ చేస్తే నువ్వేం చేస్తావ్?’ అంది. ఆర్టిస్టులకు ఎలా చేయాలో చెబుతానన్నా. ‘అల్లు అర్జున్‌కు చెబుతావా నువ్వు? బన్నీ ఆ మాత్రం చేయలేడా? నువ్వు చెప్పేదేంటి!’ అంది. కొన్నాళ్లు తనది ఇన్నోసెన్సా? మరొకటా? అర్థం కాలేదు. సెట్లో కూడా అప్పుడప్పుడూ అందరూ తమ తమ పనులు చేసేస్తుంటే... ‘ఇక్కడ నా జాబ్ ఏంటి?’ అనే భయం వేస్తుంది. వాళ్లు సరిగ్గా చేసినా, ఏదొకటి మార్పులు చెబుతాం. చివరకు, ఎడిటింగ్‌లో వాళ్లు చేసిందే పెట్టుకుంటాం. మామూలుగా ఎప్పుడైనా మీ వైఫ్ మిమ్మల్ని తిట్టిన, కోప్పడిన సందర్భాలున్నాయా? ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయించలేదని ఫీలవుతుంటుంది. ఇంటికి వెళ్లినప్పుడు అబ్బాయి ఏం చేశాడో చూడమని మా ఆవిడ చూపిస్తుంది. ఆనందపడతా. కానీ, నా సినిమా హిట్టయితే ఉన్నంత ఆనందం ఉండదేమోననే డౌట్. ఒక్కోసారి పర్సనల్ లైఫ్‌ను నెగ్లెక్ట్ చేస్తాం. ‘దర్శకుడు’లోనూ అంతే. అతని లైఫ్‌లో ప్రేమ, దర్శకత్వం రెండూ ఉంటాయి. కానీ, వాడు దర్శకత్వానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ప్రేమకు ఇవ్వడు. ఉదాహరణకు... మా ఆవిడతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు తను రెండు డ్రస్సులు చూపిస్తే.. ‘బాగున్నాయి, రెండూ తీసుకో’ అన్నా. అలాంటి నేను ఓసారి తమన్నా కాస్ట్యూమ్ బాగోలేదని రెండు గంటలు ‘100% లవ్’ షూటింగ్ ఆపేశా. కాస్ట్యూమ్స్ తెప్పించి వెతుకుతుంటే, వెనుక మా ఆవిడ ఉంది. ‘హీరోయిన్ కోసం ఇంత టైమ్ కేటాయించావ్. నాకోసం లేదు’ అని అలిగింది. ఆమెను బుజ్జగించడానికి కొంచెం టైమ్ పట్టింది (నవ్వుతూ). ‘దర్శకుడు’ సినిమా ట్రైలర్లో ‘దర్శకత్వమంటే 20 శాతం క్రియేటివిటీ, 80 శాతం మేనేజ్మెంట్’ డైలాగ్పై మీ ఫీలింగ్? కథ రాసేంత వరకు మన చేతిలో ఉంటుంది. తర్వాత ఒప్పించడానికి కొందర్ని మేనేజ్ చేయాలి. అలాగని, వాళ్లేం తప్పు చేయడం లేదు. నేను, వాళ్లూ అందరికీ నచ్చాలనే క్రమంలో క్లాష్ తప్పదు. తర్వాత సెట్‌కి వెళ్లగానే ఓ ఐదొందల మందిలో ఎవరినీ నొప్పించకుండా, సినిమాను కంప్లీట్ చేయాలి. అప్పుడు.. 20 శాతం క్రియేటివిటీ అనేది 100 శాతం. 80 శాతం మేనేజ్మెంట్ అనేది 20 శాతం. 20 శాతం ఎఫర్ట్స్‌తో 80 శాతం మేనేజ్మెంట్ చేయాలి. 80 శాతం ఎఫర్ట్స్‌తో 20 శాతం క్రియేటివిటీ చూపాలి. నెక్ట్స్ ఏంటి? అశోక్‌ను హీరోగా కంటిన్యూ చేస్తారా? దర్శకుణ్ణి చేస్తారా? చేతిలో ఓ పనుంటే దాంతో ఎలాగైనా బతకొచ్చు. అశోక్ మంచి రైటర్. అయితే... ఈ సిన్మా రిజల్ట్ బట్టి తన ఫ్యూచర్ ఉంటుంది. సూపర్ హిట్టయితే హీరోగా రెండు ఛాన్సులొస్తాయి. లేదంటే... దర్శకుడవుతాడు. లాజిక్స్‌తో సినిమా తీసే మీరు ఎప్పుడో 1985లోకి వెళ్లి పల్లెటూరి నేపథ్యంలో ‘రంగస్థలం’ తీస్తున్నారేంటి? ఎప్పట్నుంచో పల్లెటూరి నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది. రామ్‌చరణ్ ‘రంగస్థలం’తో అది కుదిరింది. కథ ప్రకారమే 1985 నేపథ్యం ఎంచుకున్నా. ప్రయోగమేమీ కాదు, మంచి కమర్షియల్ సినిమా. 85లోకి వెళ్లి తీస్తేనే కథ వర్కౌట్ అవుతుంది. అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. అలాంటి లాజిక్స్ కొన్ని ఉన్నాయి. పాపికొండల్లో సెల్ సిగ్నల్స్, పొల్యూషన్ లేని చోట చిత్రీకరించాం. మీరు నమ్మరు నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఏం లేవు. ఆరోగ్యంగా ఉన్నా. ఇక్కడికి రాగానే మళ్లీ మొదలు. మీరు మ్యాథ్స్ లెక్చరర్ కదా! మీ దగ్గర్నుంచి సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఆశించొచ్చా? సైన్స్ ఫిక్షన్ చేయాలంటే ఇక్కడి మార్కెట్ చాలదు. హిందీలో చేయాలి. అలాంటి కాన్సెప్ట్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి. కానీ, అవి వర్కౌట్ అవ్వాలంటే చాలా కుదరాలి. భారీ బడ్జెట్‌తో తీసేంత లిబర్టీ రావాలంటే కంటిన్యూస్ సక్సెస్‌లు ఉండాలి. పూరి జగన్నాథ్ డ్రగ్స్ ఇష్యూ వార్తలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆయనకు ఇంకో మంచి కథ దొరికిందనిపిస్తుంది. ఆయన చాలా స్ట్రాంగ్. పూరీతో మాట్లాడితే... ఆయన మనసెంత అందమైనదో తెలుస్తుంది. ఐ లవ్ హిమ్. ఆయన్ను కలవాలని ఓ రోజు ఇంటి వరకు వెళ్లా. లేరన్నారని వచ్చేశా. వెంటనే కాల్ చేశా. ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. -
కొత్త కోణంలో... కుమారి కాంబినేషన్
రాజ్‌తరుణ్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ అందిస్తున్న కథతో మరో చిత్రం తెరకెక్కనుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ హిటై్టన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ పతాకాలపై తాజా చిత్రాన్ని విజయప్రసాద్ బండ్రెడ్డి, సునీత– రాజ్‌కుమార్ బృందావనం నిర్మించనున్నారు. ‘‘విభిన్న చిత్రాలను అందించాలనే ఉద్దేశంతోనే సుకుమార్ రైటింగ్ సంస్థను స్థాపించాం. సుకుమార్ ఆలోచనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ కొత్త కోణంలో ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
అమరం.. అఖిలం.. ప్రేమ!
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతి సినిమాలోనూ తప్పకుండా ఉంటుంది కూడా. అయితే.. ప్రేమను సరికొత్తగా చూపడంలో దర్శకుడు సుకుమార్‌ది ప్రత్యేకమైన శైలి. కథ అందించడంతో పాటు నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’, దర్శకత్వం వహించిన ‘ఆర్య’, ‘100% లవ్’ చిత్రాలు సుకుమార్ శైలిని స్పష్టం చేశాయి. ఇప్పుడాయన అందరూ కొత్తవాళ్లతో ఓ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్నారు. సుకుమార్ దగ్గర కో-డెరైక్టర్‌గా పనిచేసిన జనార్థన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘అమరం.. అఖిలం.. ప్రేమ’ అనే టైటిల్ ఖరారు చేశారట! ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధన్ సంగీతం అందిస్తున్నారు. -
సుకుమార్‌తో శర్వా
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్న ఈ యంగ్ హీరో, త్వరలో ఓ క్రియేటివ్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలతో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్‌తో సినిమా చేయనున్నాడు యంగ్ హీరో శర్వానంద్. అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు కాదు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పిన సుక్కూ, ఆ బ్యానర్‌పై కుమార్ 21ఎఫ్ సినిమాను తెరకెక్కించి ఘనవిజయం సాధించాడు. ఇప్పడు అదే బ్యానర్లో శర్వానంద్ హీరోగా సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. మరోసారి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలోనే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట సుకుమార్. అంతేకాదు కుమార్ 21ఎఫ్ తరహాలోనే కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమారే అందించనున్నాడు. -
ఆ హీరో శాలరీ కోటి రూపాయలు!
హైదరాబాద్ : దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెత తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకూ లక్షల్లో పారితోషికం తీసుకునే ఈ హీరో తాజాగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ ...ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిట మినిమమ్ గ్యారంటీ 'హీరో'గా మారాడు. డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సారథ్యంలో ఇటీవల విడుదలైన 'కుమారి 21 ఎఫ్' చిత్రం విజయంతో రాజ్ తరుణ్ కోటి క్లబ్‌లోకి చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి గానూ ఈ యువ హీరో రూ.25 లక్షలు తీసుకున్నాడు. బ్యానర్‌తో పాటు టాప్ టెక్నిషియన్లు ఉండటంతో రాజ్ తరుణ్ తన రేటును తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక 'సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు' సినిమా నుంచే రాజ్ తరుణ్ కోటి రెమ్యునరేషన్ ను అప్లయి చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాంగోపాల్ వర్మ, వంశీ దర్శకత్వంలో అతడు నటిస్తున్నాడు. కాగా కుమారి 21 ఎఫ్ సక్సెస్‌తో రాజ్ తరుణ్‌కు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అతడి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో రాజ్ తరుణ్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేశాడు. -
కుమారి 21 ఎఫ్
సుకుమార్ లవ్‌స్టోరీలు టిపికల్‌గా ఉంటాయి... డిఫరెంట్‌గా ఉంటాయి... ఇన్నోవేటివ్‌గా ఉంటాయి... ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. డెరైక్టర్‌గా ఎన్నో లవ్‌స్టోరీలు తీసిన ఆయన ఫస్ట్‌టైమ్ ప్రొడ్యూసర్‌గా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ తీస్తున్నారు. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడం విశేషం. టాప్ మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ కెమేరామ్యాన్ రత్నవేలు ఈ చిత్రానికి వర్క్ చేయడం మరో విశేషం. ఈ నెలాఖరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాజ్‌తరుణ్ ‘కుమారి 21ఎఫ్’
-
అక్టోబర్30న రానున్న 'కుమారి 21F'
-
కుమారితో ప్రేమాయణం
రాజ్ తరుణ్ ఇప్పుడు కుమారి అనే అందమైన అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ లవ్ రియల్ కాదు.. రీల్ కోసం. రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ కథ అందించి, నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. హీబా పటేల్ కథానాయిక. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆవిష్కరించారు. ‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. దేవిశ్రీప్రసాద్ మంచి బాణీలిచ్చారు’’ అని రత్నవేలు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాతో రాజ్‌తరుణ్ మంచి హిట్‌ను అందుకోవడం ఖాయం. త్వరలో పాటలను, అక్టోబర్ 30న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అంతర్లీనంగా సాగే సందేశంతో సాగే యూత్‌ఫుల్ మూవీ ఇదని రాజ్ తరుణ్ అన్నారు. -
సుకుమార్ మార్క్ ప్రేమకథ
‘‘నేను చేసిన ‘ఆర్య’ చిత్రానికి సూర్య ప్రతాప్ అసోసియేట్ డెరైక్టర్‌గా చేశాడు. అతనిలో మంచి ఈజ్ ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన లైన్ నచ్చి, ఈ కథ తయారు చేశాను. ఈ కథను తనే తెరకెక్కిస్తే న్యాయం జరుగుతుందనుకున్నా. ఈ చిత్రానికి దేవిశ్రీస్రాద్, రత్నవేలు, రాజ్‌తరుణ్.. ఈ ముగ్గురూ హీరోలు. స్నేహానికి విలువిచ్చి, సంగీతం అందించడానికి దేవిశ్రీప్రసాద్, ఛాయగ్రాహకుడిగా చేయడానికి రత్నవేలు ఒప్పుకున్నారు. సున్నితమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. ఆయన నిర్మాతగా మారి, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై పీఏ మోషన్ పిక్చర్స్ సంస్థ అధినేత థామస్ రెడ్డి ఆదూరితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్‌తరుణ్, షీనా బజాజ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి అక్కినేని నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సూర్య ప్రతాప్ మాట్లాడుతూ - ‘‘‘కరెంట్’ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నన్ను నమ్మి సుకుమార్ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెడతా’’ అన్నారు. ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతల్లో ఒకరైన థామస్ రెడ్డి ఆదూరి అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు, సహనిర్మాతలు: ఎం. రాజా, ఎస్. రవికుమార్.