కొత్త కోణంలో... కుమారి కాంబినేషన్
రాజ్‌తరుణ్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ అందిస్తున్న కథతో మరో చిత్రం తెరకెక్కనుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ హిటై్టన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ పతాకాలపై తాజా చిత్రాన్ని విజయప్రసాద్ బండ్రెడ్డి, సునీత– రాజ్‌కుమార్ బృందావనం నిర్మించనున్నారు. ‘‘విభిన్న చిత్రాలను అందించాలనే ఉద్దేశంతోనే సుకుమార్ రైటింగ్ సంస్థను స్థాపించాం. సుకుమార్ ఆలోచనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ కొత్త కోణంలో ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు నిర్మాతలు.