వైఎస్ఆర్ 'మనసున్న నాయకుడు'
వైఎస్ఆర్ 'మనసున్న నాయకుడు'
Published Sat, Apr 16 2016 1:47 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. వైజాగ్కు చెందిన అడరి రవికుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సీనియర్ హీరో సుమన్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. మరో ప్రముఖ నటుడు సత్యరాజ్ వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు.
శనివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు మనసున్న నాయకుడు అనే టైటిల్ను కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు చిత్రయూనిట్ తెలిపారు. జూన్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
Advertisement
Advertisement