స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. బన్నీ కళ్లలో ప్రతీకార సెగలు కనిపిస్తున్నాయని కామెంట్లు చేశారు. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తుండగా హీరోయిన్ రష్మికా మందన్నా డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. తాజాగా విలన్ పాత్రకు సంబంధించి ఫిల్మీ దునియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. దీని ప్రకారం.. పుష్ప యూనిట్ బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారు. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడు. (జూన్‌లో మోసగాళ్ళు)
కాగా, రజనీకాంత్ దర్బార్ చిత్రంలోనూ విలన్‌గా సునీల్ శెట్టి మెప్పించాడు. తొలుత విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ అగ్ర నటులు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్‌ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించినప్పటికీ సునీల్ శెట్టి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలాను చిత్రబృందం సంప్రదించారంటూ లీకువీరులు దరువేసి మరీ చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. (బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’)
పుష్ప: విలన్‌గా బాలీవుడ్ అగ్ర నటుడు
Published Mon, Apr 13 2020 12:47 PM | Last Updated on Mon, Apr 13 2020 1:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment