బాలీవుడ్ నటి సన్నీలియోన్ సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. సన్నీలియోన్, ఆమె భర్త డానియెల్ వెబర్, పెంపుడు కూతురు నిషా కౌర్‌తో పాటు కవలలు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని సన్నీ ట్వీట్ చేశారు. అతి తక్కువ సమయంలో దేవుడు తమకు ముగ్గురు పిల్లలని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని సన్నీ పేర్కొన్నారు.
God's Plan! Surprise! pic.twitter.com/PEwxTdGAAU
— Sunny Leone (@SunnyLeone) 5 March 2018
మాకు కొన్ని వారాల కిందట ఇద్దరు అబ్బాయిలు జన్మించారంటూ సన్నీలియోన్, వెబర్‌లు దంపతులు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వారికి ‘అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్’అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. కాగా సన్నీలియోన్ తన సహ నటుడు డానియెల్ వెబర్ ను 2011 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన 21 నెలల వయసున్న పాపను సన్నీ - వెబర్ దంపతులు 2017 జూలైలో దత్తత తీసుకుని నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment