సన్నీ లియోన్‌ అరుదైన ఫొటోలు | Sunny Leone Shares Heart-warming Photos | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌ అరుదైన ఫొటోలు

Published Thu, Dec 15 2016 12:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

సన్నీ లియోన్‌ అరుదైన ఫొటోలు

సన్నీ లియోన్‌ అరుదైన ఫొటోలు

మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ సోదరుడి పెళ్లి అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్‌లో జరిగింది. సన్నీ సోదరుడు సందీప్‌ మెహ్రా, దక్షిణాదికి చెందిన కరిష్మా నాయుడిని ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సన్నీ తన భర్త డానియల్‌ కలసి హాజరైంది. సిక్కులు, తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది.

సోదరుడి పెళ్లిలో దిగిన ఫొటోలను సన్నీ లియోన్‌ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్‌ చేసింది. ఈ వేడుకలో తమ కుటుంబ సభ్యులందరం ఉన్నామంటూ ఫొటోల కింద క్యాప్షన్‌ రాసింది. సోదరుడు, అతని భార్య ఫొటోలను, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో సన్నీ బంధువులు దక్షిణాది సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

సన్నీ లియోన్‌ పేరుగా వినగానే సాధారణంగా మాజీ పోర్న్ స్టార్‌గా, వెండితెరపై అందాలు ఆరబోసే నటిగా భావిస్తారు. సన్నీ అరుదుగా ఇలా సంప్రదాయ దుస్తుల్లో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement