సూర్యకు జోడిగా అమలాపాల్ | Suriya, Amala Paul to play a couple | Sakshi
Sakshi News home page

సూర్యకు జోడిగా అమలాపాల్

Published Thu, Feb 5 2015 2:32 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

సూర్యకు జోడిగా అమలాపాల్ - Sakshi

సూర్యకు జోడిగా అమలాపాల్

సూర్యకు జంటగా నటించే అవకాశం అమలాపాల్‌ను వరించింది. వివాహానంతరం కథానాయికగా నటించే అతికొద్దిమందిలో ఈ మలయాళీ భామ ఒకరు. అతి తక్కువ కాలంలో కొద్ది చిత్రాలతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది అమలాపాల్. అదే విధంగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఏకకాలంలో నటించిన నటిగాను ఈ కేరళ కుట్టిపేరు తెచ్చుకున్నారు. దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ ఆ తరువాత మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు.  

తమిళంలో నటుడు సూర్య సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇదు నమ్మ ఆళు చిత్రాన్ని పూర్తి చేసినదర్శకుడు పాండిరాజ్ తాజాగా బాలల ఇతివృత్తంతో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2డి పిక్చర్స్ బ్యానర్‌లో సొంతంగా నిర్మిస్తున్నారు. ఇందులో ముఖ్యపాత్రను నటి బిందుమాధవి పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించనున్నారు. ఆయనకు జంటగా అమలాపాల్ నటించనున్నారు.  వివాహానంతరం ఆమె నటించనున్న తొలిచిత్రం ఇదే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement